సుధీర్ బాబు నెక్ట్స్ మూవీ "నన్నుదోచుకుందువటే" ఫస్ట్ లుక్
'సమ్మెహనం' లాంటి మంచి విజయం అందుకున్న హీరో సుధీర్ బాబు తర్వాతి సినిమా తన సొంత బేనర్లో చేయబోతున్నారు. ఇటీవలే 'సుధీర్ బాబు ప్రొడక్షన్స్' బ్యానర్ లాంచ్ చేసిన ఆయన ఆర్.ఎస్.నాయుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నన్ను దోచుకుందువటే' సినిమా చేస్తున్నారు.
శుక్రవారం 'నన్ను దోచుకుందువటే' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేయనున్నారు.

దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... టైటిల్ ఎనౌన్స్ చేయ్యగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకూడదు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు ఉన్నారు. కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది, కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే మిగతా వివరాలు ఎనౌన్స్ చేస్తామని తెలిపారు.
నటీనటులు
సుధీర్ బాబు, నభ నతేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
సాంకేతిక వర్గం
డిఓపి - సురేష్ రగుతు
మ్యూజిక్ డైరెక్టర్ - అజనీష్ బి లోకనాథ్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీకాంత్ రామిశెట్టి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్. సాయి వరుణ్
నిర్మాత - సుధీర్ బాబు
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ - ఆర్ ఎస్. నాయుడు


Click it and Unblock the Notifications











