అప్పట్లో నాగార్జున 'హలో బ్రదర్' సినిమాలో ప్రతినాయకుడు గా చేసిన నెపోలియన్ తర్వాత తమిళంలో బిజీగా ఉండటంతో తెలుగు సినిమాల్లో చేయలేదు. మన దర్శక,నిర్మాతలూ మర్చిపోయారు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మన తెరపై కనిపించబోతున్నారు. మొన్న 'దశావతారం' తో ఒక్క సారిగా మన వారి దృష్టిని ఆకర్షించటంతో ఈ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది శ్రీకాంత్ 99 వ సినిమాలో . సత్య అనే దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.ఇక నెపోలియన్ ఈ సినిమాలోనూ పూర్తి స్ధాయి విలన్ గా కనిపించనున్నాడు. ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్ళే ఈ సినిమాకు మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది.