»   » నీడ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్.... కాన్సెప్టు కొత్తగా ఉంది!

నీడ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్.... కాన్సెప్టు కొత్తగా ఉంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్వరలో రాబోతున్న 'నెపోలియన్' సినిమా ఇపుడు హాట్ టాపిక్ అయింది. తాజాగా విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకునే విధంగా, కాన్సెప్టు పరంగా కొత్తగా ఉండటమే ఇందుకు కారణం.

ప్రతినిధి ఫేం రచయిత ఆనంద్ రవి ప్రధాన పాత్రలో నెపోలియన్ అనే మూవీ తెరకెక్కుతుండగా తాజాగా ఈ చిత్ర మోషన్ టీజర్ విడుదల చేశారు. ఇందులో నీడ పోయిందని ఓ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. నిజంగానే అతడికి నీడ లేక పోవడం చూసి అధికారులు షాకవుతారు.

'నెపోలియన్'... ద మ్యాన్ హూ లాస్ట్ హిస్ షాడో అనే సబ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రచన, దర్శకత్వం బాధ్యతలతో పాటు హీరో పాత్ర కూడా ఆనంద్ రవి పోషిస్తున్నాడు. బోగేంద్రగుప్త నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ సదాశివుని సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా కోమలి నటిస్తోంది.

త్వరలో ట్రైలర్ మరింత ఆసక్తికరంగా రిలీజ్ చేయబోతున్నారట. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించబోతున్నారు.

English summary
Watch the motion teaser of the film 'Napoleon'. It is an upcoming Telugu film. Prathinidhi fame writer Anand Ravi has registered the title Napoleon for his debut directorial film where he is playing a lead role. The Man, who lost his Shadow, is the tag-line of Napoleon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu