Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవిని విష్ చేస్తూ నారా లోకేష్ ట్వీట్... బాలయ్య ఫ్యాన్స్ రియాక్షన్ చూశారా?
మెగాస్టార్ చిరంజీవి నేటి(ఆగస్టు 22)తో 64వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ను విష్ చేస్తూ అభిమానులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో తెలుగు దేశం పార్టీ నాయకులు నారా లోకేష్, గంటా శ్రీనివాస్ కూడా చేరిపోయారు.
'సినీ వినీలాకాశంలో మకుటంలేని మగమహారాజుగా ఎదిగి, అభిమానులకు ఆత్మీయతను పంచే మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.' అని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
|
ఎందరికో స్ఫూర్తి అంటూ లోకేష్ ట్వీట్
‘ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించే విభిన్నపాత్రలలో నటించి, ప్రేక్షకహృదయాలలో చెరగని స్థానాన్ని పదిలం చేసుకున్నారు చిరంజీవిగారు. పట్టుదల, కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించి, ఎందరికో స్ఫూర్తిగా నిలచిన చిరంజీవిగారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
బాలయ్య అభిమానులు విభిన్నంగా రియాక్ట్ అయ్యారు
కాగా... నారా లోకేష్ చేసిన ట్వీట్ మీద పలువరు బాలయ్య అభిమానులు విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. హ్యాపీ బర్త్ డే టు నందమూరి బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్ అంటూ కొందరు చిరంజీవి, బాలయ్య కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.
సినిమా లైఫ్ విషయంలో మాత్రమే లోకేష్ వర్డ్స్ ఆప్ట్ అవుతాయి
చిరంజీవి విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మెగాస్టార్ సినీ జీవితం విషయంలో మాత్రమే యాప్ట్ అవుతాయి. పాలిటిక్స్ విషయంలో సూట్ కావు అంటూ.... కొందరు ఫ్యాన్స్ అభిప్రాయ పడ్డారు. ఇంకొందరేమో చిరంజీవి-జూ ఎన్టీఆర్, చిరంజీవి-బాలయ్య కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేశారు.
మా లోకేష్ అన్న ట్వీట్ చేశాడు కాబట్టి...
మా లోకేష్ అన్న ట్వీట్ చేశాడంటే నేను కూడా విషెస్ చెబుతాను. హ్యాపీ బర్త్ డే చిరు.. అంటూ మరో అభిమాని మోగాస్టార్ను విష్ చేశారు. మరికొందరు ఇదంతా ప్రేమతో చేస్తున్న ట్వీట్స్ కాదని, ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న ట్వీట్ అంటూ విమర్శించడం గమనార్హం.