సైరాపై నారా లోకేశ్ కామెంట్.. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిందంటూ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక విడుదలైన అన్ని చోట్ల మంచి స్పందన వచ్చింది. తొలి స్వతంత్ర్య సమరయోధుడు, రేనాటి వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో తెరకెక్కించిన సైరా.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

సైరాను పొగడ్తలతో ముంచెత్తిన టాలీవుడ్
టాలీవుడ్ స్థాయిని పెంచేలా నిర్మించిన రామ్ చరణ్ కు అన్ని వైపుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చిరంజీవి చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. సైరా ఒకెత్తు అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రెటీలందరూ సైరా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. రాఘవేంద్ర రావు, రాజమౌళి, శోభు యార్ల గడ్డ లాంటి ప్రముఖులు సైరాపై ప్రశంసలు కురిపించారు.

మెగా పార్టీ ఇచ్చిన బన్నీ
నిన్నసాయంత్రం సినిమా వీక్షించిన బన్నీ.. ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మెగా హీరోలంతా హాజరయ్యేలా చేశాడు బన్నీ. త్రివిక్రమ్, సుకుమార్, వంశీ పైడిపల్లీ, హరీష్ శంకర్, అఖిల్, శ్రీకాంత్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, అల్లు బాబీ, అల్లు శిరీష్ అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా నారా లోకేశ్ కామెంట్..
సైరా సినిమా చూసిన నారా లోకేశ్.. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, చిత్ర యూనిట్ మొత్తానికి హార్ధికాభినందనలు'అంటూ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











