టీడీపీ ఏ ఒక్కరిదో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై నారా లోకేష్ సెన్సేషనల్ కామెంట్స్

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందని, అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అనే కోణంలో చర్చలు ముదిరాయి. ఇంతలో ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు కూడా స్పందించడంతో ఇది కాస్త హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ విషయమై బాలకృష్ణ అల్లుడు భరత్ స్పందించగా తాజాగా నారా లోకేష్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి పోతే..

టీడీపీ వెన్ను విరిచిన వైసీపీ

టీడీపీ వెన్ను విరిచిన వైసీపీ

గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ టీడీపీ వెన్నువిరిచింది. ఊహించని రీతిలో అత్యధిక సీట్లు గెలిచి టీడీపీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి జరుగుతున్న చర్చలు మరింత ముదిరాయి. టీడీపీ ఉనికిని కాపాడుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందే అనే టాక్ మొదలైంది. దీంతో టీడీపీ నాయకుల మీడియా సమావేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీకి సంబందించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలో చంద్రబాబు

సరిగ్గా ఇలాంటి సమయంలో చంద్రబాబు

సరిగ్గా ఇలాంటి తరుణంలో నందమూరి హరికృష్ణ ప్రథమ వర్ధంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా వచ్చి జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, కుటుంబ సభ్యులను పరామర్శించడం మరిన్ని చర్చలకు హావిచ్చింది. ఎన్టీఆర్‌ని చంద్రబాబు నాయుడే స్వయంగా టీడీపీలోకి ఆహ్వానించినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి.

బాలకృష్ణ అల్లుడి రియాక్షన్..

బాలకృష్ణ అల్లుడి రియాక్షన్..

దీంతో ఈ ఇష్యూపై బాలయ్య అల్లుడు, టీడీపీ నాయకుడు భరత్ సంచలన కామెంట్స్ చేశారు. జూ ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదనే అనుకుంటున్నామని, తాము పార్టీని బాగానే హ్యాండిల్ చేస్తున్నామని, అలాంటపుడు జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఎందుకు అనుకుంటామని పేర్కొంటూ సంచలన కామెంట్స్ చేశారు.

తాజాగా నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తాజాగా ఇదే అంశంపై ఓ మీడియా సమావేశంలో నారా లోకేష్ ఆసక్తికరంగా స్పందించారు. టీడీపీ లోకి ఎన్టీఆర్ ఎంట్రీపై మీ స్పందనేంటి? అనే ప్రశ్నపై రియాక్ట్ అవుతూ.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. టీడీపీ కోసం ఎవ్వరైనా పని చేయొచ్చని, టీడీపీ ఏ ఒక్కరిదో కాదు అని అన్నారు లోకేష్.

మళ్ళీ మళ్ళీ ఇదే అంశం.. ఇంతకీ ఏం జరుగుతోంది?

మళ్ళీ మళ్ళీ ఇదే అంశం.. ఇంతకీ ఏం జరుగుతోంది?

నిజానికి గతంలో 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా పార్టీకి దూరంగా ఉంటూ సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ టీడీపీ వంక చూడరనుకున్న తరుణంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ ఎంట్రీ అంశం చర్చనీయాంశం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

RRR లో ఎన్టీఆర్..

RRR లో ఎన్టీఆర్..

తనపై ఎన్నిరకాల ప్రచారాలు వచ్చినా ఎన్టీఆర్ మాత్రం స్పందించడం లేదు. తన సినిమాలతో బిజీగా ఉంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన RRR షూటింగ్ లో పాల్గొంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఈ భారీ సినిమా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X