మా ముద్దుల మామయ్య... టాపు లేచిపోద్ది: ‘జై సింహ’ వేడుకలో లోకేష్

By Bojja Kumar

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రానున్న 'జై సింహ' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్
ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

ఆ సినిమా వల్లే...చాలా గర్వ పడుతున్నాను

ఆ సినిమా వల్లే...చాలా గర్వ పడుతున్నాను

‘‘నేను... నారా భువనేశ్వరి పుత్రుడు లోకేష్‌ను. నన్ను నేను ఇలా పిలుచుకోవడానికి చాలా గర్వ పడుతున్నాను. దానికి కారణం కూడా ఒక సినిమా. గౌతమీ పుత్ర శాతకర్ణి. అందుకే మీ అందరి తరుపున నందమూరి బసవతారకం పుత్రుడు నందమూరి బాలకృష్ణ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు'' అంటూ లోకేష్ తన ప్రసంగం మొదలు పెట్టారు.

నా ముద్దుల మామయ్య...మనందరి బాలయ్య

నా ముద్దుల మామయ్య...మనందరి బాలయ్య

‘‘నా ముద్దుల మామయ్య, మన అందరి బాలయ్య... ఆయన నటించిన జై సింహా ఆడియో ఫంక్షన్ మన గడ్డపై, మన అమరావతిలో జరుగడం చాలా ఆనందంగా ఉంది.'' అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

అలాంటి స్టార్ బాలయ్య ఒక్కడే

అలాంటి స్టార్ బాలయ్య ఒక్కడే

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. మనసులో ఉన్న మాట డైరెక్టుగా చెప్పగలిగే ఏకైక హీరో మన బాలయ్య బాబు. హీరోకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఒక హీరో కోసం ప్రాణం కూడా త్యాగం చేసే ఫ్యాన్స్ బాలయ్య బాబుకే ఉంటారు... అని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఆ రికార్డులు బద్దలవ్వడం ఖాయం

ఆ రికార్డులు బద్దలవ్వడం ఖాయం

‘‘1955లో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీ రామారావుగారు ‘జయ సింహ' సినిమా చేస్తే మన విజయవాడలో 160 రోజులు ఆడింది. ఆ చరిత్రను మళ్లీ మన ‘జై సింహ' తిరగరాయడం ఖాయం. మీసాలు తిప్పడం అయినా, తొడకొట్టడం అయినా చేయగలిగే ఒకే ఒక్క హీరో మన బాలయ్య బాబు. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహా నాయుడు, ఒక సింహా, ఒక లెజెండ్, ఒక గౌతమీపుత్ర శాతకర్ణి... చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా ఒక బాలయ్య బాబు వల్లే అవుతుంది.'' అని లోకేష్ వ్యాఖ్యానించారు.

నన్ను వెంటాడుతున్నారు

నన్ను వెంటాడుతున్నారు

నేను మంత్రి అయ్యాక..... ఆయన నన్ను వెంటాడుతున్నారు. మా హిందూపురం నియోజకవర్గానికి రావడం లేదు అంటున్నారు. ఆయన స్పీడు చూస్తుంటే నాకే భయం వేస్తుంది. మా దేవాన్ష్ తో కూడా సినిమా తీసేట్టు ఉన్నారు. అలాంటి ఎనర్జీ ఆయనకు ఉంది.... అంటూ లోకేష్ చమత్కరించారు.

టాపు లేచిపోద్ది

టాపు లేచిపోద్ది

మనం ఇపుడు ట్రైలరే చూశాం, రేపు సినిమా రాబోతోంది... టాప్ లేచిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మళ్లీ ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాసేది మన బాలయ్య బాబుగారే... అని లోకేష్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X