బాహుబలి: రాజమౌళి గురించి నారా లోకేష్ ఇలా..
హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాపై, దాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలో రాజమౌళి ఒక అద్భుతమైన సినిమా తీసారని, హాలీవుడ్ రేంజి సినిమా తీసారని, తెలుగు సినిమా రేంజిని పెంచారని పలువురు ప్రశంసిస్తున్నారు.

టీడీపీ లీడర్ నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘బాహుబలి లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి అభినందనలు తెలుపుతున్నాను. తెలుగు సినిమాను కొత్త లెవల్‌కి తీసుకెళ్లారు' అని ట్వీట్ చేసారు.
‘బాహుబలి' సినిమా చూసిన అనంతరం రామోజీరావు స్పందిస్తూ....రాజమౌళి, అతని టీం హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ‘బాహుబలి' సినిమా తీసారు. ఇలాంటి సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగడం ఆనందంగా ఉంది అని రామోజీరావు వ్యాఖ్యానించారు.
బాహుబలి సినిమాలో ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ పాత్రలో నటించిన కన్నడ స్టార్ సుదీప్ స్పందిస్తూ...రాజమౌళి సినిమాలో నటించడం, బాహుబలి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు.


Click it and Unblock the Notifications











