మామయ్య కేక అంటూ బాలయ్య అల్లుడి ట్వీట్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ 'లెజెండ్' చిత్రం శుక్రవారం విడుదలైన సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపత్యంలో పలువురు సీనీ తారలు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బాలయ్య పెద్ద అల్లుడు నారా లోకేష్ కూడా.... మామయ్య పెర్ఫార్మెన్స్ కేక అంటూ ట్వీట్ చేసాడు.
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా తెరకెక్కించిన 'లెజెండ్' చిత్రం గ్రాండ్ విడుదలైంది. బాలయ్య అభిమానులు కోరుకునే కమర్షియల్ మసాలా అంశాలను బాగా దట్టించి ఈచిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి.
బోయపాటి సినిమాల్లో పేలే పంచ్ డైలాగులు...ఈచిత్రంలో మరోసారి బాగా పేలాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ మరో హైలెట్. ఈ సినిమాలో జగపతి బాబు తొలిసారిగా విలన్ పాత్రలో కనిపించాడు. ఇందులో జగపతి బాలయ్య హీరోయిజానికి ధీటుగా క్రూరమైన విలనిజాన్ని పండించారు. బాలయ్య సరసన సోనాల చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటించారు.
స్లైడ్ షోలో లోకేష్, పలువురు సినీ తారలు చేసిన కామెంట్స్...

నారా లోకేష్
లెజెండ్ సినిమా చూసాను. బాలయ్య మామయ్య బ్యాక్ విత్ బ్యాంగ్. ఆయన పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఆయన పాత్రల్లో జీవించారు.

వెన్నెల కిషోర్
బాలయ్య హై ఓల్టేజ్ యాక్షన్, పవర్ ఫుల్ డైలాగులు లెజెండ్ చిత్రానికి హైలెట్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన మాస్ మసాలా చిత్రం ఇది.

దేవా కట్ట
లెజెండ్ చిత్రంలో బాలయ్య గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రత్నంగారు అందించిన డైలాగులు చాలా బాగున్నాయి. టీం మొత్తానికి కంగ్రాట్స్.

మనోజ్ మంచు
లెజెండ్ చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఈ చిత్రం సూపర్ హిట్.

శ్రీను వైట్ల
లెజెండ్ సినిమా చూసాను. బాలయ్య పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఆయన డైలాగులు చెబుతుంటే సింహం గాండ్రించినట్లు ఉంది. సినిమా టీం మొత్తానికి అభినందనలు.

బిఏ రాజు
లెజెండ్ సినిమా చూస్తే సింహం మళ్లీ తిరిగి వచ్చినట్లనిపించింది. సెకండాఫ్ అదిరిపోయింది. డైలాగులు డైనమైట్లలా పేలాయి.

నిఖిల్ సిద్దార్థ్
లెజెండ్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బాలయ్య పెర్ఫార్మెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేసాను.

దేవిశ్రీ ప్రసాద్
లెజెండ్ సినిమాను విజయవంతం చేసిన అందరికీ థాంక్స్. నేను అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోరు బాగుందని అంతా పొగిడేస్తున్నారు.


Click it and Unblock the Notifications











