‘రంగస్థలం’ సినిమాపై ఏపీ మంత్రి నారా లోకేష్ ట్వీట్
రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' మూవీ బ్లాక్ బస్ట్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 180 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. పల్లెటూరి నేపథ్యంలో దర్శకుడు సుకుమార్ తెలుగు గ్రామీణ నేటివిటీ ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా రంగస్థలం వీక్షించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సినిమాపై పొగడ్తలు గుప్పిస్తూ ఓ ట్వీట్ చేశారు.

'మాకు 'రంగస్థలం' లాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు రామ్‌చరణ్, సుకుమార్‌కు ధన్యవాదాలు. సినిమా చూసిన చాలా సేపటివరకు ఆ పాత్రలు మనతోనే ఉండిపోతాయి. గ్రేట్ వర్క్ గాయ్స్' అని ట్వీట్ చేశారు.
రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, అజయ్ ఘోష్, నరేష్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీమేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న విడుదలైన ఈచిత్రం సంచలన ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











