Kalki 2898 AD: కల్కి మూవీపై నారా లోకేష్ ట్వీట్.. ఇద్దరు అమ్మాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో హీరోగా పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. మొదట్లో తెలుగు చిత్రాలకు మాత్రమే పరిమితం అయిన అతడు.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా రేంజ్ మూవీలనే చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. వాటి ఫలితాలతో సంబంధం లేకుండా మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ చేశాడు. దీనిపై నారా లోకేష్ చేసిన ట్వీట్‌ను మీరే చూడండి!
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమానే 'కల్కి 2898 ఏడీ'. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం టైం ట్రావెల్ కథతో రూపొందింది. దీన్ని తెలుగులోనే కాకుండా చాలా భాషల్లో తీశారు. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ మూవీని రెడీ చేసేశారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను ఎన్నో అంచనాల నడుమ నేడే (జూన్ 27వ తేదీ) ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీనికి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా వసూళ్లు పోటెత్తబోతున్నాయి.
'కల్కి 2898 ఏడీ' మూవీ కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక, వాళ్ల నిరీక్షణను నేటితో తెరపడింది. దీంతో అందరూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమా చూసి ట్విట్టర్ వేదికగా పోస్టులు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ తాజాగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తాజాగా తన X (ట్విట్టర్) ఖాతాలో 'కల్కి 2898 ఏడీ మూవీకి టెర్రిఫిక్ రివ్యూలు వస్తున్నాయని సంతోషంగా ఉంది. ఈ అత్యుత్తమ చిత్రంతో ఇండియన్ సినిమాకు కొత్త అర్థఆన్ని చెప్పిన ప్రభాస్ గారికి, అమితాబ్ గారికి, కమల్‌హాసన్ గారికి, దీపిక పదుకొణె గారికి అభినందనలు. అలాగే, మన తెలుగు సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకు వెళ్లిన అశ్వినీదత్‌తో పాటు ప్రియాంక, స్వప్నలకు ప్రత్యేక అభినందనలు' అని రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











