RRR: ఒక్క ట్వీట్‌తో నోర్లు మూయించిన నారా లోకేష్.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళికి స్పెషల్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అయిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. బాహుబలితో తన స్టామినాతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దీంతో ఇది ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా బిజినెస్‌తో పాటు రిలీజ్ కూడా అత్యధికంగా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ చేశాడు. తద్వారా గతంలో తనపై వచ్చిన విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

ఇద్దరు హీరోలు.. బడా డైరెక్టర్ మూవీ

ఇద్దరు హీరోలు.. బడా డైరెక్టర్ మూవీ

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన భారీ చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). అత్యధిక బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇచ్చారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను చేశారు.

భారీ అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్

భారీ అంచనాలతో గ్రాండ్‌గా రిలీజ్

క్రేజీ కాంబోలో వచ్చిన RRR మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో, 20 దేశాల్లో దీన్ని తీసుకొచ్చారు.

ఇండియాలోనే టాప్ మూవీగా పేరు

ఇండియాలోనే టాప్ మూవీగా పేరు

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీపై ఎన్నో అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 190 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల్లోనూ భారీ రేటు పలికింది. ఇలా అన్ని ఏరియాలు కలిపి రికార్డు స్థాయిలో రూ. 451 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

ఎంతో సందడిగా.. పాజిటివ్ టాక్‌తో

ఎంతో సందడిగా.. పాజిటివ్ టాక్‌తో

తారక్ - చరణ్ కాంబోలో వచ్చిన RRR (రౌద్రం రణం రుధిరం) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో ప్రీమియర్ షోలతో పాటు బెనిఫిట్ ఆటలు కూడా పూర్తయ్యాయి. దీనికి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో కళకళలాడుతున్నాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది.

సామాన్యులతో సెలబ్రిటీలు కూడా

సామాన్యులతో సెలబ్రిటీలు కూడా

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ కోసం అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక, వాళ్ల నిరీక్షణను నేటితో తెరపడింది. దీంతో అందరూ థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. అంతేకాదు, ట్విట్టర్ వేదికగా పోస్టులు కూడా చేస్తున్నారు.

RRR మూవీపై నారా లోకేష్ ట్వీట్

RRR మూవీపై నారా లోకేష్ ట్వీట్

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విడుదల సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో 'ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి స్పందన వచ్చి తెలిసి సంతోషంగా ఉంది. తారక్, రామ్ చరణ్, మాస్ట్రో రాజమౌళికి అభినందనలు. మంచి సినిమాను అందించిన యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్. ఈ వారంలోనే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడబోతున్నాను' అంటూ పేర్కొన్నారు.

విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టేశాడుగా

విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టేశాడుగా

నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం 'భీమ్లా నాయక్' మూవీ గురించి ట్వీట్ చేయడంతో అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయనపై విమర్శలు చేశారు. ఇక, ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై స్పందించడం.. తారక్‌ను అభినందించడంతో వాళ్లంతా పాజిటివ్‌గా రిప్లైలు ఇస్తున్నారు. దీంతో అటు టీడీపీ ఫ్యాన్స్.. ఇటు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X