టీడీపీ శ్రేణులు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రగడ.. ఎంటరైన నారా లోకేష్.. సెన్సేషనల్ ట్వీట్

Recommended Video

Nara Lokesh Request TDP Supporters To Watch Saaho Movie || Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందింది 'సాహో' మూవీ. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు ప్రమోషన్స్ నిమిత్తమై తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిన ప్రభాస్ అక్కడ వైసీపీ అధినేత జగన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. దీంతో అది జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ప్రభాస్‌పై, సాహో సినిమాపై నెగెటివ్ ప్రచారాలు చేస్తున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై టీడీపీ నాయకుడు నారా లోకేష్ రియాక్ట్ అవుతూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. వివరాల్లోకి పోతే..

టీడీపీ శ్రేణులు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రగడ

టీడీపీ శ్రేణులు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రగడ

ఎప్పుడైతే ప్రభాస్ వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పాజిటివ్‌గా స్పందించాడో.. అప్పటి నుంచే టీడీపీ శ్రేణులు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య రగడ మొదలైందని తెలుస్తోంది. ప్రభాస్ సాహో సినిమాపై టీడీపీ అనుకూల వర్గాల నెగెటివ్ ప్రచారం, దానికి కౌంటర్‌గా ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటర్లు వేయడం లాంటి ఉదంతాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి.

టీడీపీ అనుకూల వర్గాలు.. టార్గెట్ సాహో

టీడీపీ అనుకూల వర్గాలు.. టార్గెట్ సాహో

ఈ నేపథ్యంలో 'సాహో'పై టీడీపీ చేస్తున్న నెగెటివ్ ప్రచారం సినిమాపై ప్రభావం చూపిస్తుందా అనే చర్చ మొదలైంది. ప్రభాస్ వ్యతిరేక ప్రచారంలో భాగంగా టీడీపీ వర్గాలు సాహో సినిమానే లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిసింది. టీడీపీ అనుకూల టీం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రభాస్ అభిమానుల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.

 ఎంటరైన నారా లోకేష్.. ఊహించని విధంగా రియాక్షన్

ఎంటరైన నారా లోకేష్.. ఊహించని విధంగా రియాక్షన్

దీంతో ఈ విషయమై తాజాగా టీడీపీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేసిన ఆయన.. ప్రభాస్ అభిమానులు, టీడీపీ అనుకూల వర్గాల మధ్య వార్ నడుస్తోందని వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి వార్తలు పుట్టించిన వారిని తనదైన మాటలతో కడిగిపారేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 సాహో కోసం ఎదురు చూస్తున్నా అంటున్న నారాలోకేష్

సాహో కోసం ఎదురు చూస్తున్నా అంటున్న నారాలోకేష్

భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'సాహో' సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు తాను కూడా వేచి చూస్తున్నానని నారాలోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలుపుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న ఇడియటిక్ కథనాలను నమ్మొద్దని అన్నారు.

టిడిపి మద్దతుదారులకు, ప్రభాస్ ఫ్యాన్స్‌కి వినతి

ఎవ్వరూ ఊహించని రీతిలో రియాక్ట్ అయిన నారా లోకేష్.. సాహో సినిమాను చూడాలని టిడిపి మద్దతుదారులను, ప్రభాస్ అభిమానులను తాను అభ్యర్థిస్తున్నట్లుగా ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయన చేసిన ఈ ట్వీట్‌పై ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాహో మూవీ

సాహో మూవీ

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించి సాహో సినిమా తెరకెక్కించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X