చిత్ర సీమలో విషాదం.. నిర్మాత మృతిపై నారా రోహిత్, సుధీర్ వర్మ ఎమోషనల్

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాత్తుగా మరణించారు. ఆదివారం నాడు ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ టాలీవుడ్ ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ ఇద్దరి సినిమాలకు సందీప్ కొరిటాల నిర్మాతగా వ్యవహరించారు. నాటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారు భావోద్వేగానికి గురయ్యారు.

 ఆ రెండు చిత్రాలకు..

ఆ రెండు చిత్రాలకు..

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'స్వామిరారా', పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన 'రౌడీ ఫెలో' సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. అందుకే నాటి బంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు వేశారు.

శాంతి చేకూరాలి..

శాంతి చేకూరాలి..

నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. 'స్వామిరారా' రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం అని సుధీర్ వర్మ ట్వీట్‌ చేశాడు. అంతే కాకుండా నాడు షూటింగ్ చేస్తుండగా సెట్‌లో దిగిన స్టిల్స్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

అందరి కంటే..

అందరి కంటే..

సందీప్ కొరిటాల మరణించిన విషయాన్ని ముందుగా నారా రోహిత్ అందరికీ తెలియజేశాడు. ఆయన వేసిన ట్వీట్‌తో ఈ విషయం బయటపడింది. నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి అంటూ సందీప్ ఫోటోను షేర్ చేశాడు నారా రోహిత్.

 సంతాపం..

సంతాపం..

ఇక ఈ వార్త తెలిసిన మరికొంత మంది సెలెబ్రిటీలు, దగ్గరి సన్నిహితులు సందీప్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నారా రోహిత్ తన కొత్త సినిమా అప్డేట్లు ఏవీ కూడా ఇంకా ప్రకటించలేదు. సుధీర్ వర్మ మాత్రం చివరగా రణరంగం అనే సినిమాతో నిరాశ పరిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X