బాబు కూడా పోలీస్ డ్రస్ తొడిగేసాడు
హైదరాబాద్ : ఇప్పుడు పోలీస్ సీజన్ నడుస్తోంది. దాదాపు ప్రతీ హీరో పోలీస్ గా కనపడటానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తెరపై ఖాళీ డ్రస్ వేసుకుని, పంచ్ లు విసురుతూ డైలాగులు చెప్తున్నారు. పెద్ద హీరోలే కాదు..ఓ మాదిరి చిన్న హీరోలు కూడా పోలీస్ గా తమను తాము నిరూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా నారా రోహిత్ సైతం పోలీస్ గా అదరకొట్టాలని నిర్ణయించుకున్నాడు. అతని తాజా చిత్రం రౌడీ ఫెలో లో రోహిత్ పోలీస్ గా కనపడనున్నడని సమాచారం.
దర్శకుడు మాట్లాడుతూ.... మాటలు రాక మాట్లాడలేనివాళ్లు కొందరైతే.. మాటలు వచ్చీ నోరు మెదపలేనివాడు పేదవాడు. ఆ పేదోడి ఆవేదనను అర్థం చేసుకొని అండగా నిలబడిన పోలీసు కథేంటో తెరపైనే చూడాలి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రౌడీఫెలో'. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటించారు. ప్రకాష్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

నిర్మాత మాట్లాడుతూ ''ఒక పోలీసు అధికారి కథ ఇది. ఖాకీ చొక్కా వేసుకొన్న ఆ పోలీసు రౌడీఫెలో అని ఎందుకు అనిపించుకొన్నాడన్నది ఆసక్తికరం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రచార చిత్రాల్లో వినిపించిన సంభాషణలు ఆకట్టుకొన్నాయి. నారా రోహిత్ నటనతో పాటు కృష్ణచైతన్య చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
''అరవై సెకన్లకు 72 సార్లు కొట్టుకొనే గుండెకే లాజిక్ లేదు. ఇక నేను చేసే పనుల గురించి అడిగితే నేనేం చెబుతాను..'' అంటున్నారు నారా రోహిత్. విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











