నారా రోహిత్ లిటిల్ ఆర్జే హంట్ బిగ్ ఎఫ్ఎం
బాణం సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నారా రోహిత్...తర్వలో సోలోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో నారా రోహిత్ నిషా అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే రోహిత్ శనివారం హైదరాబాద్ లోని బిగ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో సందడి చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా బిగ్ ఎఫ్ఎం వారు నిర్వహించిన లిటిల్ ఆర్జే హంట్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని చిన్నారుల ను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లోని ప్రతిభా సామర్థ్యాలు వెలికి తీయవచ్చని రోహిత్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని గమనించి వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
ఎస్వీకే సినిమా బ్యానర్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ 'సోలో" చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదల కాబోతోంది. తన సోలో సినిమా కుటుంబ సమేతంగా చూడతగిన వినోదాత్మక సినిమా అని రోహిత్ చెప్పుకొచ్చారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, సాయాజీషిండే, సుహాసిని, రవిప్రకాష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, ప్రొడక్షన్ కంట్రోలర్: వై.యుగంధర్, స్టైలింగ్: అర్చన పరశురామ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య


Click it and Unblock the Notifications











