twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: నారా రోహిత్ డైలాగ్

    By Srikanya
    |

    బాణంతో పరిచయమైన నారా రోహిత్ తాజా చిత్రం 'సోలో".ఈ చిత్రంలో అతను 'పోయేటప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది కానీ... పుట్టినప్పుడు నా చుట్టు నలుగురు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది"అంటూ ప్రకాష్ రాజ్ తో ఓ డైలాగు చెప్తాడు.ఆ డైలాగుని దర్శకుడు పరుసరామ్ రివిల్ చేసారు.ఆ డైలాగుకు అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది.ఇక కథ ప్రకారం..ఈ చిత్రంలో హీరో ఓ అనాధ అని..అతను ప్రేమించిన అమ్మాయి (నిషా అగర్వాల్) తండ్రి ప్రకాష్ రాజ్ కు తన కూతుర్ని పెద్ద కుటుంబం లో ఇవ్వాలని ఉంటుందని,దాంతో అతను అనాధకి ఇవ్వనని నో చెప్తాడు.అప్పుడు ఈ డైలాగుని చెప్తాడు.అప్పటినుంచి సోలో అతను ఆమెను ఎలా గెలుచుకున్నాడనేది మిగతా కథ అంటున్నారు.

    ఈ చిత్రం ఈ నెలాఖరున చిత్రం విడుదల కానుంది.''ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్, కామెడీ ఇలా... అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. 'ఏ సాలిడ్ లవ్‌స్టోరి" అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. అందుకు తగ్గట్టుగా సినిమా వుంటుంది. ఇటీవలే మణిశర్మ స్వరపరిచిన గీతాలను విడుదల చేశాం. పాటలకు మంచి స్పందన వస్తోంది.అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది"" అని నిర్మాత చెప్తున్నారు.

    యువత,ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశురామ్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ కలసిన ఓ లవ్ స్టోరీ ఇక ఈ చిత్రం కథ అమ్మాయి ఎవరో ఏంటో చూసుకోకుండా ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆ తర్వాత పెద్దవాళ్ల ద్వారా సమస్యలు వస్తాయి. అప్పుడు హీరో తన ప్రేమ కోసం సోలో గా చేసే పోరాటమే చిత్ర కథాంశం. దర్శకుడు ఇదే విషయం చెపుతూ..ప్రేమ సమరంలో గెలవడానికి మా హీరో వేసిన ఎత్తులు ఎలాంటివో మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీషిండే, అలీ, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారుల. సంగీతం: మణిశర్మ.ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, స్టైలింగ్: అర్చన పరశురామ్. అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాణం: ఎస్వీకే సినిమా.

    English summary
    Nara Rohit starrer Solo with a tagline Solid Love Story is hitting the big screens on 24th November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X