twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్...'బాణం'?

    By Staff
    |

    నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రానికి 'బాణం' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. దంతలూరి చైతన్య దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఓ కుర్రాడు ఐపియస్ ఆఫీసర్ అవటం కధ అని వినపడుతోంది. ఇక 'రాజకుమారుడు'తో మహేష్ నూ, 'చిరుత'తో రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ పరిచయమైన 'గంగోత్రి','ఒకటో నెంబర్ కుర్రాడు'తో తారకరత్నను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ ఉన్న నిర్మాత అశ్వనీదత్ రూపొందిస్తున్న చిత్రం కావటంతో ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ నారా రోహిత్ మరెవరో కాదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామమూర్తినాయుడి తనయుడు.

    ఇక ఈ చిత్రంలో అతని ప్రక్కన హీరోయిన్ గా ఎవరు చేస్తే బావుంటుంది అనే దానికి రకరకాలగా ఆలోచించి చివరకు తమన్నాని సెలక్ట్ చేసినట్లు సమాచారం. మొదట స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రారంభిస్తారని అన్నారు. కానీ ఇప్పుడు డేట్ మార్చారు.ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించేందుకు అశ్వనీదత్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మే 4న ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ, వైజాగ్, విజయనంగరం, బొబ్బిలి, కర్ణాటకలోని కొన్ని ముఖ్య ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, గంధం నాగరాజు మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.

    మొదట సురేష్ ప్రొడక్షన్స్ లో వినపించిన ఈ స్క్రిప్టు అక్కడ ఓకే కాకపోవటంతో అశ్వనీదత్ దగ్గరకు చేరింది. కొత్త బంగారు లోకం సినిమాకు పనిచేసిన టీమ్ లో కొంతమంది టెక్నికల్ ఈ చిత్రానికి సపోర్టు చేయనున్నారు.ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ నెలలోనే నందమూరి హీరోలందరి సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్ర ప్రారంభోత్సావాన్ని ఇదే నెలలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X