Don't Miss!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నారా రోహిత్ జోడి ఆమె?
నారా రోహిత్ జోడిగా వేదిక సెలక్ట్ అయ్యింది. అర్జున్ హీరో గా ఆ మద్యన వచ్చిన 'శివకాశి", లారెన్స్ హీరోగా వచ్చిన అనువాద చిత్రం 'ముని" చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వేదికకు తన అందాన్ని, అభినయాన్ని చూపించుకునే సరైన వేదిక ఎట్టకేలకు లభించింది. నారా రోహిత్‌ను హీరోగా పరిచయం చేస్తూ, అగ్ర నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న 'బాణం" చిత్రంలో హీరోయిన్గా వేదిక ఎంపిక చేసారు. ఈ చిత్రం షూటింగ్ గత నెలరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా నిరవధికంగా నిర్మాణం జరుపుకుంటోంది. షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నాక ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ నిర్మించనున్న చిత్రానికి 'బాణం' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. దంతలూరి చైతన్య దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఓ కుర్రాడు ఐపియస్ ఆఫీసర్ అవటం కధ అని వినపడుతోంది. ఇక 'రాజకుమారుడు'తో మహేష్ నూ, 'చిరుత'తో రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ పరిచయమైన 'గంగోత్రి','ఒకటో నెంబర్ కుర్రాడు'తో తారకరత్నను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ ఉన్న నిర్మాత అశ్వనీదత్ రూపొందిస్తున్న చిత్రం కావటంతో ఇప్పటికే ఈ చిత్రంపై క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ నారా రోహిత్ మరెవరో కాదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామమూర్తినాయుడి తనయుడు.
వైజాగ్, విజయనంగరం, బొబ్బిలి, కర్ణాటకలోని కొన్ని ముఖ్య ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుందని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి చైతన్య దంతులూరి కథ-స్క్రీన్ ప్లే సైతం అందిస్తుండగా, గంధం నాగరాజు మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, అనిల్ భండారి సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.