‘వీర భోగ వసంత రాయలు’... నారా రోహిత్ లుక్ ఇదే!
రోటీన్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు నారా రోహిత్. కమర్షియల్ అంశాల కోసం వెంపర్లాడకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ 'వీర భోగ వసంత రాయలు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా... తాజాగా అతడి లుక్ రివీల్ చేస్తూ మరో పోస్టర్ విడుదల చేశారు. ఒక చెయ్యికి కట్టుతో .. సీరియస్ లుక్ తో ఉన్న నారా రోహిత్ ఆవేశపూరితమైన పాత్రలో తెరపై కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే శ్రీయకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నెక్ట్స్ శ్రీవిష్ణు పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కాబోతోందని, ఇందులో అతడు గుండుతో కనిపిస్తారని సమాచారం.
బాబా క్రియేషన్స్ బేనర్లో అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నారా రోహిత్ మాట్లాడుతూ... ఈ సినిమాలో హీరో అని ఎవరూ లేరు. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం, తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదని కచ్చితంగా చెప్పగలను అన్నారు.


Click it and Unblock the Notifications











