పవన్ సాధినేనితో కలిసి పని చేయనున్న నారా రోహిత్

By Bojja Kumar

హైదరాబాద్: 'ప్రేమ్ ఇష్క్ కాదల్' సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని నారా రోహిత్ తో ఓ సినిమా చేయదానికిం సిద్దమవుతున్నాడు. ఓ కొత్త నిర్మాత ఈ సినిమాని నిర్మించనున్నాడు. ప్రస్తుతానికి నారా రోహిత్ సరసన నిత్యా మీనన్ ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు. శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా, కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్న ఈ సినిమా ఆగష్టులో సెట్స్ పైకి వెళ్లనుంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నారా రోహిత్ 'శంకర' అనే చిత్రంతో పాటు, 'రౌండీ ఫెల్లో' చిత్రాల్లో నటిస్తున్నాడు.

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు సమర్పణలో శ్రీ లీల మూవీస్ పతాకంపై ఆర్.వి.చంద్రమౌళి (కిన్ను) నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "శంకర". నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి "భీమిలీ కబడ్డీ జట్టు" ఫేం తాతినేని సత్య దర్శకుడు.

Nara Rohit next with Pawan Sadineni

ఇక 'రౌడీ ఫెల్లో' సినిమా విషయానికొస్తే... నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్న చిత్రం 'రౌడీ ఫెలో '. విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X