twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్ హీరో అనిపించుకోవాలని లేదు

    By Srikanya
    |

    మాస్‌ సినిమాలు చెయ్యాలి, మాస్‌ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ఆత్రుత నాలో ఎప్పుడూ లేదు. ముందు నేనేం చేయగలనో ప్రేక్షకులకు తెలియాలి. అలా తెలియాలంటే ముందు నా సినిమాని అందరూ చూడాలనేదే నా కోరిక. 'సోలో'తో నేను అనుకొన్న ఆ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నాను అంటున్నారు నారా రోహిత్. ఆయన తాజా చిత్రం 'సోలో'రెండు వారాల క్రితం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రోహిత్ ఇలా స్పందించారు. అలాగే 'సోలో'చూసిన వారంతా మంచి సినిమా చేశావని అభినందిస్తున్నారు. స్నేహితులు, ఇంట్లోవాళ్లు మాత్రం ఇంతగా ఏడిపిస్తావని వూహించలేదన్నారు. ఈ చిత్రంతో వినోదం, భావోద్వేగాలు పలికించగల హీరోగా గుర్తింపు దక్కింది.

    కొన్ని సినిమాలు యూత్ మాత్రమే చూడాలన్నట్టుగా ఉంటాయి. కొన్నింటిని మహిళలు మాత్రమే ఇష్టపడతారు. ఇంకొన్ని సినిమాలు ఇంకో వర్గాన్ని ఆకర్షిస్తుంటాయి. కానీ అందరినీ మెప్పించే చిత్రాలు మాత్రం అరుదుగానే వస్తుంటాయి. 'సోలో' ఆ తరహా చిత్రమే అన్నారు.ఇక తన తదుపరి చిత్రాలు గురించి చెపుతూ..'కథ' దర్శకుడు శ్రీనివాస్‌ రాగ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న కథాంశమది. నా పాత్ర, హావభావాలు భిన్నంగా ఉంటాయి. ఆ తర్వాత విజయ్‌కృష్ణ అనే ఓ కొత్త దర్శకుడితో సినిమా ఉంటుంది. ఐదో చిత్రం మళ్లీ పరశురామ్‌తోనే చేయబోతున్నా. ఒకదానితో ఒకటి సంబంధం లేని కథాంశాలే ఇవన్నీ అన్నారు.

    English summary
    Nara Rohit's happy to work with director Parasu Ram for Solo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X