అబ్బాయి నారా రోహిత్ సెటైర్లు చంద్రబాబుకు వర్తించవా?, ఆడియో వేడుకలో పాల్గొన్న చంద్రబాబు!

By Bojja Kumar

హైదరాబాద్: అధికారం...అధికారం...అధికారం, ఏముందిరా అందులో, చుట్టూ పదిమంది సెక్యూరిటీ, ఉదయాన్నే లేస్తే ఇంటి చుట్టూ వంద మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి, తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్ధత, మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్లి పోతారు, దీని కోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా?......అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నది మరెవరో కాదు, హీరో నారా రోహిత్.

నారా రోహిత్ తను నటిస్తున్న తాజా సినిమా 'ప్రతినిధి' చిత్రంలో చెప్పిన డైలాగ్ ఇది. స్వయంగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్, అలాంటి రాజకీయ వాతావరణంలో పెరిగిన నారా రోహిత్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే......ఈ చిత్రం ఆడియో వేడుకను స్వయంగా తన పెదనాన్న చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బుధవారం విడుదల చేయించారు నారా రోహిత్. మరి రాజకీయ నాయకులపై ఈ సినిమాలో ఉన్న సెటైర్లు చంద్రబాబుకు వర్తించవా? అంటూ ప్రశ్నించే వాళ్లు ఉన్నారు.

కాగా...ఈ సినిమా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు మేలు చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి సినిమా విడుదలైతేగానీ సినిమాలో ఏముందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం.

ప్రతినిధి ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ సోలో చూద్దాం..

ప్రతినిధి

ప్రతినిధి

సుధా సినిమాస్ పతాకం పై ‘ప్రతినిధి' చిత్రాన్ని సాంభశివ రావు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ మండవ దర్శకుడు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శుభ్రా అయ్యప్ప రోహిత్ సరసన హీరొయిన్ నటిస్తుంది.

చంద్రబాబు

చంద్రబాబు


నారా రోహిత్ పెదనాన్న, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యంలో చంద్రబాబు, నారా రోహిత్, పరుచూరి గోపాలకృష్ణ తదితరులను చూడొచ్చు.

సన్మానం

సన్మానం


ప్రతినిధి ఆడియో వేడుక సందర్భంగా చంద్రబాబు, నారా రోమిత్‌లను గజమాలతో సన్మానిస్తున్న అభిమానులు.

హీరో నాని

హీరో నాని


ప్రతినిధి ఆడియో వేడుక సందర్భంగా హీరో నాని కూడా హాజరై సందడి చేసారు. చంద్రబాబుకు నాని సన్నిహితంగా మెలగడం చర్చనీయాంశం అయింది.

హీరోయిన్‌తో చంద్రబాబు కబుర్లు

హీరోయిన్‌తో చంద్రబాబు కబుర్లు


చంద్రబాబు ఫేసులో నవ్వు కనిపించడం చాలా అరుదు. తాజాగా ఆడియో వేడుకలో చంద్రబాబు హీరోయిన్‌ శుబ్రా అయ్యప్పతో నవ్వుతూ మాట్లాడారు.

అబ్బాయితో..

అబ్బాయితో..


నారా చంద్రబాబు నాయుడు, రోహిత్ ఆడియో వేడుక సందర్భంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం

చంద్రబాబు మాట్లాడుతూ..

చంద్రబాబు మాట్లాడుతూ..


చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...''యువతరంలో స్ఫూర్తిని రగిలించే అంశాన్ని కథగా ఎంచుకొని దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. సమాజాన్ని ప్రక్షాళన చేస్తే ప్రపంచంలో మనదేశం మొదటిస్థానంలో నిలబడుతుంది. రాజకీయాల్లో పడిపోతున్న విలువల్ని నిలబెట్టేందుకు నవతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ చిత్రం స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో రోహిత్‌ చాలా బాగా నటించాడని అర్థమవుతుంది. 'ప్రతినిధి' సినిమాలో రాజకీయ నాయకులకు చాలా ప్రశ్నలు వేశారు'' అన్నారు.

ఎన్టీఆర్ స్పూర్తి

ఎన్టీఆర్ స్పూర్తి


''సినిమారంగం... రాజకీయరంగం ఇలా ఎందులోనైనా ఎన్టీఆర్‌కి ఎవరూ సాటి రాలేరు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు'' అన్నారు చంద్రబాబు.

డాన్సర్లు

డాన్సర్లు


ప్రతినిధి ఆడియో వేడుక సందర్భంగా సినిమా గీతాలకు డాన్సర్లు స్పెప్పులేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X