twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నంగా నటించిన హీరో.. ‘మేక సూరి’ది సాహసమే!

    |

    కరోనా వచ్చి ఎన్నో పద్దతులను మార్చేసింది. ముఖ్యంగా సినీ ప్రపంచంలో పెను మార్పులను తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు అందరికీ పరిచయమే ఉన్నా.. ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ప్రతీ ఒక్కరికీ తెలిసి వచ్చింది. అంతేకాకుండా ప్రతిభ గల వారికి ఇదొక అక్షయ పాత్రలా లభించింది. ఓటీటీపై ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు రాజ్యమేలుతున్నాయి. తెలుగులోనూ ఆహా వంటి ఓటీటీ యాప్‌లు దుమ్ములేపుతున్నాయి.

    కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు. అందులో సూరిది కసాయి (మేక తోలు వలిచి, మాంసం కొట్టే) వృత్తి. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తున్న సూరి, అవలీలగా నిమిషాల్లో మేక తోలు వలిచి ముక్కలు కొట్టేస్తాడు. దాంతో అతడి పేరు 'మేక' అయిపోతుంది. అయితే తాజాగా మేక సూరి ట్రైలర్‌ను నారా రోహిత్ విడుదల చేశారు. సహజత్వానికి అద్దం పట్టేలా పాత్రల చిత్రీకరణ,కథ కథనాలున్నాయని తెలుస్తోంది. క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో లాస్ట్ షాట్ (నగ్నంగా ఉన్న హీరో) సాహసమనే చెప్పాలి.

     Nara Rohit Released Meka Suri Trailer

    థియేటర్‌ ఆర్టిస్టులు సుమయ, అభినయ్‌ను నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను త్రినాద్ వెలిసెల ('మోసగాళ్లకు మోసగాడు', 'ఒక్క క్షణం' సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా, 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' సినిమాకి అసిస్టెంట్‌ రైటర్‌) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌ మొదటి భాగం ఈ నెల 31న 'జీ 5'లో స్ట్రీమింగ్‌ కానుంది. 'రోబో', 'స్నేహితుడు' సినిమాతో అసోసియేట్ అయిన కార్తీక్ కంచెర్లకు చెందిన సింబా ఎంటర్టైన్మెంట్ 'మేక సూరి'ని నిర్మిస్తోంది.

    English summary
    Nara Rohit Released Meka Suri Trailer. Meka Suri wen series in Zee 5 original. a telugu New web series in zee 5 which is directed by trinadh velisela.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X