అల్లు అర్జున్ ఆపర్ ని ఎత్తుకెళ్ళిన నారా రోహిత్
కేవలం బాణం అనే ఒక్క చిత్రంతోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన నారా రోహిత్ గుర్తుండే ఉండి ఉంటాడు. రీసెంట్ గా పరుశరామ్ దర్శకత్వంలో సినిమా కమిటైన నారా రోహిత్...త్వరలో సెవెన్ అప్ యాడ్ లోనూ కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ సెవెన్ అప్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఈ నెలతో అర్జున్ కాంట్రాక్ట్ ముగిసింది. దాంతో ఆ ఆఫర్..నారా రోహిత్ ని వరించింది. ఇక అల్లు అర్జున్.. ప్రస్తుతం బద్రినాత్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.


Click it and Unblock the Notifications











