నిత్యా మీనన్, నారా రోహిత్ కాంబినేషన్ లో...
బాణంతో హీరోగా పరిచయమైన నారా రోహిత్ తన తదుపరి చిత్రం సోలో షూటింగ్ హడావిడిలో ఉన్నాడు.ఇప్పుడు అతను మరో చిత్రం ఓకే చేసాడు.జెనీలియా నటించిన కథ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి గానూ హీరోయిన్ గా నిత్యామీనన్ ని తీసుకున్నారు. సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని తమ సివి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.ఇక అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ ఓవర్ నైట్ లోనే కుర్రకారు కలల హీరోయిన్ అయ్యిపోయింది. కానీ ఆ తర్వాత వచ్చిన సెగ,180 చిత్రాలు విజయం సాధించలేదు. ప్రస్తుతం నితిన్ సరసన ఇష్క్ అనే చిత్రం చేస్తోంది.
సోలో చిత్రాన్ని యస్.వి.కె. సినిమా పతాకంపై పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, జయసుధ, సుమలత, ఎం.ఎస్.నారాయణ, అలీ, శ్రీనివాసరెడ్డి, సుభాష్, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరశురామ్ (బుజ్జి).సోలో చిత్రం నవంబర్ లో విడుదల కానుంది.ఆడియో అక్టోబర్ లో విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











