ఈగో ప్రాబ్లం అంటూ నారా రోహిత్... (వీడియో)
హైదరాబాద్: పురాణాలన్నీ ఈగో ప్రాబ్లమ్సే అన్నమాట అంటూ నారా రోహిత్ వస్తున్నారు. ఆయన హీరోగా గీతరచయిత కృష్ణ చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ ఫెలో'. ఈ చిత్రం రిలీజ్ డేట్ నవంబర్ 21న ఖరారైన సందర్భంగా ఆ చిత్రం నిర్మాతలు మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా లేటెస్ట్ గా ఓ ట్రైలర్ ని వదిలారు. ఆ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. మీరూ చూడండి...ఆ వీడియోని...
విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ఆదరణ పొందుతున్న నారా రోహిత్ ప్రేక్షకుల్లో చక్కటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన రౌడీ ఫెలో టైటిల్ తో మన ముందుకు వస్తున్నారు. రౌడీ ఫెలో టైటిల్ నెగెటివ్‌గా వున్నా ఇందులో పాజిటివ్ అంశాల్ని చూపించారు దర్శకుడు. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రకాష్‌రెడ్డి నిర్మాత. విశాఖసింగ్ హీరోయిన్. సన్నీ ఎమ్.ఆర్ సంగీతాన్నందించారు.
నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్న చిత్రం 'రౌడీ ఫెలో '. రామోజీ ఫిలిం సిటీ, రాజమండ్రి, కొల్లేరు, భీమవరం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

నిర్మాత టి. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.
విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











