నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ రిలీజ్ డేట్ ఇదే...

By Bojja Kumar

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా గీతరచయిత కృష్ణ చైతన్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ ఫెలో'. ఈ చిత్రం రిలీజ్ డేట్ నవంబర్ 21న ఖరారైన సందర్భంగా ఆ చిత్రం నిర్మాతలు మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా సహ నిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడారు.

‘ఓ రచయిత దర్శకుడైతే...చిత్రాన్ని ఎంత అందంగా, అద్భుతంగా నిజాయితీగా వెండితెరపై ఆవిష్కరించగలడో ‘రౌడీ ఫెలో' చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్ అవుతుంది. గీత రచయితగా ప్రశంసలు అందుకున్న కృష్ణ చైతన్య ‘రౌడీ ఫెలో' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. ‘మూగవాడిది ఒక విధమైన మౌనమైతే...పేదవాడిది మరొక విధమైన మౌనం. మూగవాడు మాటలు రాక మాట్లాడడు. పేదవాడికి అన్ని తెలిసినా మాట్లాడలేడు' ఇలా ఆయన రాసిన సంభాషణలు అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రానికి కమర్షియల్ అంశాలు జోడిస్తే ఎలా ఉంటుందో మా ‘రౌడీ ఫెలో' చిత్రం ఆ తరహాలోనే ఉంటుంది. పోలీసాఫీసర్‌గా నారా రోహిత్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఆయన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు' అన్నారు సందీప్ కొరిటాల.

Nara Rohit 'Rowdy Fellow' release on Nov 21st

మూవీ మిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రౌడీ ఫెలో'. నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత ప్రకాష్ రెడ్డి తెలియజేస్తూ ‘ఇటీవల విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు చక్కని స్పందన వస్తోంది. సన్నీ.ఎం.ఆర్ అందించిన పాటలు అన్ని చార్ట్ బస్టర్స్‌లో నెంబర్ స్థానంలో ఉన్నాయి. పాటలు విన్న ప్రతి ఒక్కరూ మ్యూజిక్ డిఫరెంటుగా ఉంది అంటున్నారు. సినిమా కూడా అంతే కొత్తదనంగా ఫీలవుతారు. కొత్తదనం ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయం ఈ చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇటీవల గోవాలో హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ‘ఆ సీతాదేవి నవ్వులా..' అనే పాటతో పాటు ఎంతవారు గానీ పాటలతో చిత్రం షూటింగ్ పూర్తయింది. నవంబర్ 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

రావు రమేష్, పోసాని, అజయ్, సుప్రీత్, పరుచూరి వెంకటేశ్వరరావు, అజయ్, ప్రవీణ్, తాళ్లూరి రామేశ్వరి, గొల్లపూడి తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X