twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పని రాక్షసుడు కథ (నారా రోహిత్ ‘అసుర’ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : వైవిధ్యమైన కథలు, సరికొత్త కేరక్టరైజేషన్లతో కూడిన పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపే అతికొద్ది మంది హీరోలలో నారా రోహిత్ ఒకరు. ఆయన నటించిన తాజా చిత్రం "అసుర". బాణం చిత్రం నుంచి విభిన్న కధాంశాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న హీరో నారా రోహిత్. ఆయన కొత్త చిత్రం వస్తోందంటే కొత్త తరహా చిత్రాలు చూడాలనుకునే సినీ లవర్స్ కు ఆనందమే. అదే కోవలో ఆయన ఈ సారి కూడా విభిన్నమైన టైటిల్ తో ముందుకు వస్తున్నారు. అలాగే కథ కూడా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

    ఈ చిత్రంలో నారా రోహిత్ పేరు ధర్మ. ‘పురాణాల్లో రాక్షసుల్ని చంపేవాణ్ణి దేవుడంటారు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను' అనే డైలాగ్‌ ఉంది రోహిత్ కు. చేయాల్సిన పనిని ఎవరైనా అశ్రద్ధ చేస్తే ఒప్పుకోకుండా, ఆ పనిని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఓ పని రాక్షసుడి కథ ఇది. ‘రౌడీ ఫెలో'తో పోలిస్తే మరింత రస్టిక్‌ కేరక్టర్. ఇందులో రోహిత్‌ ఓ జైలర్‌ పాత్రను పోషించారు.ఇది మోర్‌ యాక్షన్‌ ఫిల్మ్‌. పంచ్‌ డైలాగులు, ఐటమ్‌ సాంగ్‌ సహా అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా.

    హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..కథ 'ఏ' సెంటర్, సినిమా 'సి' సెంటర్ ప్రేక్షకులకనే క్లారిటీ మాలో ఉంది. నారా రోహిత్ చిత్రంలో ఎం ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అవన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. నారా రోహిత్ కమర్షియల్ చిత్రంలో ఎప్పుడు నటిస్తాడు అనే ప్రశ్నకు ఈ చిత్రం ద్వారా సమాధానం దొరుకుతుంది అన్నారు.

    Nara Rohit's Asura movie preview

    అలాగే ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. చిత్రం ఆసక్తికరంగా నడుస్తుంది. నేను నటించే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలని భావిస్తాను. నారా రోహిత్ అసుర అని చెప్పడం పబ్లిసిటీ కోసమే, ఇది పూర్తిగా దర్శకుడి చిత్రం అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    నారా రోహిత్ మాట్లాడుతూ... ''రౌడీఫెలో' తర్వాత మరోసారి పోలీసు పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. 'అసుర'లో నేను జైలర్‌ ధర్మగా కనిపిస్తా. 'రౌడీఫెలో'లో పోషించిన పోలీసు పాత్రకు, ఇందులో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సంభాషణలు పలికే విధానం, నటన అన్నీ కొత్తగానే ఉంటాయి. 'అసుర' అనే పేరు పెట్టడానికి కథే కారణం. ఇందులో నా పాత్ర తీరు ఓ పనిరాక్షసుడిని తలపిస్తుంటుంది.

    'పురాణాల్లో రాక్షసులని చంపితే దేవుళ్లు అన్నారు. అదే పని నేను చేస్తే రాక్షసుడు అంటున్నారు' అనే డైలాగ్‌ ఈ సినిమాలో ఉంది. అందుకే సినిమాకి ఉపశీర్షికగా కూడా 'గుడ్‌ ఈజ్‌ బ్యాడ్‌' అని పెట్టాం. ఈ రెండు విషయాల్ని బట్టి కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణవిజయ్‌ చిత్రాన్నిబాగా తీర్చిదిద్దాడు'' అన్నారు. రోహిత్‌ ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు.

    అలాగే...''పక్కా వాణిజ్య చిత్రాలు చేయడం లేదని నాపై ఫిర్యాదులొస్తుంటాయి. ఆ విషయంలో అసంతృప్తిగా ఉన్నవాళ్లందరినీ వందశాతం సంతృప్తిపరిచే సినిమా 'అసుర'. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రమిది. పాటలు, ఫైట్లు, డైలాగులు... ఇలా మాస్‌ని మెప్పించే అంశాలన్నీ ఉన్నాయి. నా సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండవు. కానీ ఇందులో ఆ పాట కుదిరింది. అందుకే ఈ చిత్ర విజయంపై నాకు నమ్మకముంది'' అని చెప్పుకొచ్చారు.

    బ్యానర్:దేవాస్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్స్, కుషాల్ సినిమా, అరన్ మీడియా వర్క్స్
    నటీనటులు: నారా రోహిత్ , ప్రియా బెనర్జీ , జేమ్స్ మధు, మధు సింగంపల్లి, రవివర్మ, సత్యదేవ్, భాను, రూపాదేవి తదితరులు
    సంగీతం: సాయి కార్తీక్,
    సినిమాటోగ్రఫీం యస్.వి.విశ్వేశ్వర్,
    ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల,
    ఆర్ట్: మురళి కొండేటి,
    పాటలు వశిష్టశర్మ, కృష్ణకాంత్, సుబ్బరాయశర్మ,
    డాన్స్: విజయ్,
    నిర్మాతలు: శ్యామ్ దేవభుక్తుని, కృష్ణ విజయ్,
    సమర్పణ: నారా రోహిత్
    కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం :కృష్ణవిజయ్‌
    విడుదల తేదీ: 05, జూన్, 2015.

    English summary
    Nara Rohit’s Asura movie is all set to hit the theaters today (June 5th). Rohit plays the role of a prison officer in this movie and he fights against the anti-social elements. Krishna Vijay directed this action entertainer and Shyam Devbhaktuni produced it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X