నారా రోహిత్ ‘మద్రాసి' షూటింగులో బిజీ
బాణం, సోలో చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'ఒక్కడినే' చిత్రం షూటింగ్ పూర్తయింది. దీంతో తాను కమిటైన మరో సినిమా 'మద్రాసి' షూటింగులో బిజీ అయిపోయాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. జులై నెలలోనే ప్రారంభమైన ఈచిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ తాజాగా గోవాలో ప్రారంభమైంది.
ఈచిత్రాన్ని ఎక్కువగా గుజరాత్, అండమాన్, ఢిల్లీలలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ లింగమనేని దర్శకత్వం వహిస్తుండగా ప్రస్థానం ఫేం రవి వల్లభనేని వెంకట సూర్యతేజ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మద్రాసి చిత్రంలో నారా రోహిత్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. సినిమాలో యాక్షన్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు ఈచిత్రం పోస్టర్‌లు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రివేంజ్ డ్రామా నేపథ్యంలో కథ సాగుతుందని టాక్. ఈ చిత్రానికి హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరో వైపు నారా రోహిత్ నటించిన ఒక్కడినే చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలో ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు కానుంది. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న ఒక్కడినే చిత్రంలో రోహిత్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా చేస్తోంది. గులాబీ మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. సెలక్టెవ్‌గా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న రోహిత్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications












