For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఖరారు: అప్పట్లో ఉన్నది నారా రోహితే

  By Srikanya
  |

  హైదరాబాద్ : రీసెంట్ గా 'రౌడీఫెలో'తో పలకరించిన నారా రోహిత్ మరో చిత్రం ప్రకటించేసాడు. కథ నచ్చేసి...యాక్షన్‌ ప్రధానంగా సాగే మరో కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌తోపాటు శ్రీవిష్ణు మరో హీరో గా నటిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వశిష్ట మూవీస్‌ పతాకంపై హరి, సన్నీరాజు నిర్మిస్తున్నారు. జూన్‌ మొదటివారం నుంచి చిత్రీకరణ మొదలవుతుంది.

  నిర్మాతలు మాట్లాడుతూ ''1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంలో రాయల్‌ రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో మరో హీరో గా నటిస్తున్నారు''అన్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  నారా రోహిత్ ..మరో చిత్రం అసుర విషయానికి వస్తే...

  కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలైనా..ప్రతి సినిమాలో విభిన్నపాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్‌. అలాటిందే ఇప్పుడు ఓ విభిన్న గెటప్‌లో నటించిన ‘అసుర' చిత్రం టీజర్ ను ఈ మధ్యనే విడుదల చేశారు. దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్, కుషాల్ సినిమా, అరన్ మీడియావర్క్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘అసుర'. డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

  Nara Rohit's Next: Appatlo Okadundevadu


  నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. రౌడీ ఫెలో తర్వాత పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నాడు.

  టైటిల్లో కొత్తదనంతో పాటు టీజర్ తో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపారు. ఈ సినిమాలో రోహిత్ జైలర్ గా నటించారు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కథేంటి.. అని అందరిలో ప్రశ్న మొదలయ్యింది. ఒక రాక్షసుడి పేరును హీరోకి పెట్టడమే ఆసక్తి కలగడానికి కారణం.

  నారా రోహీత్ మాట్లాడుతూ... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర' సినిమా ఉంటుంది. నా కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని తెలిపారు.

  కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

  హీరోయిన్ విషయానికి వస్తే... అడవి శేష్ సరసన ‘కిస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. విజయ్ లింగమనేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకేక్కబోయే కొత్త సినిమాలో ప్రియా బెనర్జీని హీరోయిన్ గా చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రియా బెనర్జీ ట్రెడిషనల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియా సంతోషం వ్యక్తం చేసింది. ‘కిస్' తర్వాత సందీప్ కిషన్ ‘జోరు'లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రియా బెనర్జీ నటించింది. ‘జోరు' చిత్రీకరణ సమయంలో ఆమె నటన నచ్చడంతో నారా రోహిత్ సినిమా దర్శకనిర్మాతలకు రికమండ్ చేశారు.

  English summary
  Nara Rohit has signed another action film titled as Appatlo Okadundevadu, the movie is set against in the period of 1992-1996. Director Sagar K. Chandra, of Ayyare fame, will be wielding the megaphone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X