నారా రోహిత్ ‘సోలో’ నవంబర్ 24న
గతంలో బాణం సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన నారా రోహిత్ తాజాగా 'సోలో" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 24న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. 'ఏ సాలిడ్ లవ్‌స్టోరి' అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ కథానాయికిగా నటిస్తోంది. ఎస్వీకే సినిమా బ్యానర్ పై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈనెల 22న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది. యువతతో పాటు,కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రస్తత యువతరం ప్రతినిధిగా రోహిత్ ఈ చిత్రంలో కనిపిస్తాడని దర్వక నిర్మాతలు తెలిపారు.
మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అ ఇంకా ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, సాయాజీషిండే, సుహాసిని, రవిప్రకాష్, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, ప్రొడక్షన్ కంట్రోలర్: వై.యుగంధర్, స్టైలింగ్: అర్చన పరశురామ్, అడిషనల్ స్క్రీన్‌ప్లే: సత్య


Click it and Unblock the Notifications











