twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారా రోహిత్ 'సోలో' స్టోరీ పాయింట్ ఏంటి

    By Srikanya
    |

    బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ తాజా చిత్రం 'సోలో'. యువత,ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశురామ్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కథ అమ్మాయి ఎవరో ఏంటో చూసుకోకుండా ప్రేమలో పడ్డ అబ్బాయికి ఆ తర్వాత పెద్దవాళ్ల ద్వారా సమస్యలు వస్తాయి. అప్పుడు హీరో తన ప్రేమ కోసం సోలో గా చేసే పోరాటమే చిత్ర కథాంశం. దర్శకుడు ఇదే విషయం చెపుతూ..ప్రేమ సమరంలో గెలవడానికి మా హీరో వేసిన ఎత్తులు ఎలాంటివో మా చిత్రంలో చూడాల్సిందే అంటున్నారు.

    వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు, కొంత టాకీ మినహా షూటింగ్ పూర్తయింది. నారా రోహిత్ సరసన నిషా అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''ప్రేమ కోసం ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే ఓ యువకుడి కథ ఇది. ఆ పాత్రలో నారా రోహిత్‌ ఇమిడిపోయారు. ఆయన నటన యువతకీ పెద్దవాళ్లకీ నచ్చుతుంద''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీషిండే, అలీ, ఎమ్మెస్‌నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారుల. సంగీతం: మణిశర్మ.

    English summary
    After the critically acclaimed debut film Baanam, Nara Rohit is all set to arrive with his second venture titled Solo . Rohit is pairing up with Nisha Agarwal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X