‘స్వామి రారా’కు నారా రోహిత్ వాయిస్ ఓవర్
హైదరాబాద్: నిఖిల్, స్వాతి జంటగా రూపొందుతున్న 'స్వామి రారా' చిత్రానికి హీరో నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఈ విషయమై చిత్ర సహ నిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడుతూ 'క్రైం, కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో కథ, కథనాలు ఎంతో ఆసక్తి కరంగా ఉంటాయన్నారు.
ఈ చిత్ర కథను, ప్రేక్షకులకు పరిచయం చేసేప్పుడు, కథను ముగించేప్పుడు వాయిస్ ఓవర్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. అందుకే నారా రోహిత్ వాయిస్ ఓవర్ చక్కగా కుదిరింది. తప్పకుండా రోహిత్ వాయిస్ ఈచిత్రానికి ప్లస్ అవుతుంది' అన్నారు.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ... అసలే దొంగ. ఆపై ప్రేమలో పడ్డాడు. ప్రేయసి కూడా.. 'దొరికిందంతా దోచేయ్.' అని ప్రోత్సహించే రకం. ఆ ఉత్సాహంలో మరింత రెచ్చిపోయాడు. కంటికి కనిపించిందల్లా జేబులోకి తోసేశాడు. వీరిద్దరూ కలసి చేసిన హంగామా ఎలాంటిదో తెలియాలంటే మా సినిమా చూడండి అన్నారు. సరదాగా సాగే ప్రేమకథ ఇది. నిఖిల్ అల్లరి నటన.. తప్పకుండా ఆకట్టుకొంటుంది. వినాయకుడి విగ్రహానికీ, ఓ దొంగ ప్రేమ కథకూ సంబంధం ఏమిటనేది ఆసక్తికరం అన్నారు.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'స్వామి రారా' చిత్రాన్ని చిగురుపాటి చక్కి నిర్మిస్తున్నారు. ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సన్ని సంగీతాన్ని సమకూర్చారు. కెమెరా రిచర్జ్ ప్రసాద్. కృష్ణచైతన్య పాటలు రాశారు. ఆర్ట్ నాగేంద్ర. ఎడిటింగ్ ఎస్ఆర్ శేఖర్. సమర్పణ శంకర్ చిగురుపాటి, రచన, దర్శకత్వం సుధీర్ వర్మ.


Click it and Unblock the Notifications











