కార్పొరేట్ పాలిటిక్స్‌లో నారా రోహిత్ హ్యాండ్!
హైదరాబాద్ : బాణం చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయి 'సోలో' చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహత్...ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పాలిటిక్స్ అనే విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడికి ఆయన స్వయాన బంధువు.
పొలిటికల్ బ్యాగ్రౌండ్‍తో సినిమాల్లోకి ఎంటరైన నారా రోహిత్ త్వరలో తాను చేయబోయే సినిమాలో కార్పొరేట్ పాలిటిక్స్ ప్లే చేయబోతున్నాడు. ఆ మధ్య హిందీలో వచ్చిన 'కార్పొరేట్' అనే చిత్రంలో కార్పొరేట్ ఆఫీసుల్లో రాజకీయాల గురించి బాగా చూపించిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహా కథాంశంపై దృష్టి సారించాడు రోహిత్.
తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రోహిత్ సరసన హీరోయిన్ రెజీనా నటించబోతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతం నారా రోహిత్ 'ఒక్కడినే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమే 'ఒక్కడినే'. శ్రీనివాస రాగ దర్శకత్వంలో నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో నారా రోహిత్ సరసన నిత్యా మీనన్ నటించింది. త్వరలో ఈచిత్రం విడుదల కానుంది.'


Click it and Unblock the Notifications











