నారా రోహిత్ నిధుల సేకరణ, ఇక్కడ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
హైదరాబాద్: 'బాణం' చిత్రంతో సినీ పరిశ్రమలోకి హీరోగా వచ్చి సోలో, ఒక్కడినే, ప్రతినిధి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ పుట్టినరోజు నేడు (జులై 25). ఈ సందర్భంగా అతని జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహరించారు. పలు చోట్ల సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడలో ఎస్‌కెసివి అనాధ శరణాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తాడికొండ సాయికృష్ణ ఆధ్వర్యంలో వీరపనేని శివ యూత్ సభ్యులు జులై 24 రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్దరాత్రి 12 గంటలకు బర్త్ డే కేక్‌ను అనాధ పిల్లల సమక్షంలో కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా తాడి కొండ సాయికృష్ణ మాట్లాడుతూ...'సోలో స్టార్ నారా రోహిత్ ప్రస్తుతం యూఎస్ లో ఉండటం వల ఇక్కడికి రాలేదు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం యూఎస్‌లో నిధులు సేకరిస్తున్నారు.
త్వరలో నరా రోహిత్ రౌడీ ఫెలో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు, బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు స్లైడ్ షోలో ఫోటోలు...

నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ 1
అనాద శరణాలయంలో నారా రోహిత్ పుట్టినరోజు వేడుక జరుపుతున్నదృశ్యం

నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ 2
విజయవాడలో ఎస్‌కెసివి అనాధ శరణాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తాడికొండ సాయికృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ 3
నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా చిన్నారులతో కేక్ కట్ చేయిస్తున్న అభిమానులు

నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ 4
నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా చిన్నారులకు స్వీట్లు పంచుతున్న దృశ్యం.

నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ 5
నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా అనాధ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

నారా రోహిత్
నారా రోహిత్ బర్త్ డే సెలబ్రేషన్స్...


Click it and Unblock the Notifications











