నారా రోహిత్ ‘అసుర’ ఫస్ట్ లుక్(మోషన్ పోస్టర్)

By Srikanya

హైదరాబాద్ : తొలి నుంచీ ప్రతీ సినిమాకూ తన దైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో.. సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచటంలో ముందుంటున్నాడు నారా రోహిత్. తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ‘అసుర'. ‘గుడ్ ఈజ్ బ్యాడ్' అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. ఫస్ట్ లుక్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ మోషన్ పోస్టర్ పై మీరూ ఓ లుక్కేయండి

ఈ సినిమాలో నారా రోహిత్ జైలర్ గా నటించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర' సినిమా ఉంటుందని చెప్తున్నారు. అలాగే తన కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నాడు. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పాటలు షూటింగ్ బాలన్స్ ఉంది. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అని నారా రోహిత్ తెలిపారు.

Nara Rohith New Movie Asura Motion Poster

హీరోయిన్ విషయానికి వస్తే... అడవి శేష్ సరసన ‘కిస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. విజయ్ లింగమనేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకేక్కబోయే కొత్త సినిమాలో ప్రియా బెనర్జీని హీరోయిన్ గా చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రియా బెనర్జీ ట్రెడిషనల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియా సంతోషం వ్యక్తం చేసింది.

‘కిస్' తర్వాత సందీప్ కిషన్ ‘జోరు'లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రియా బెనర్జీ నటించింది. ‘జోరు' చిత్రీకరణ సమయంలో ఆమె నటన నచ్చడంతో నారా రోహిత్ సినిమా దర్శకనిర్మాతలకు రికమండ్ చేశారు.

కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X