నారా రోహిత్ ‘ఒక్కడినే’ ఆడియో ఎప్పుడు?
ఈ కథ గురించి నిర్మాత సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక. నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. మా దర్శకుడు శ్రీనివాస్ రాగ ఎక్కడా, దేనికీ రాజీపడకుండా చిత్రీకరించారు. తప్పకుండా ఇది ఇంటిల్లిపాది మెచ్చేటువంటి అపురూప కథా చిత్రం అవుతుందని నా నమ్మకం' అని చెప్పుకొచ్చారు.
ఈ సినిమాపై అంచనాలు అదికంగా బాగా ఉన్నాయి. దీనికి కారణం నారా రోహిత్ చేసిన 'సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన 'ఇష్క్' చిత్రాలు. ఈ రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఆడియో సైతం త్వరలో విడుదల చేసి పబ్లిసిటీ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు. నిత్యా మీనన్ ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
నారా రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, సాయికుమార్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, బెనర్జీ, అలీ, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్నారు. మాటలు: చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్, కోడైరెక్టర్: కల్యాణ్, నిర్మాత: సి.వి.రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రాగ.


Click it and Unblock the Notifications












