ప్రేమదేశం గుర్తుకు వస్తోంది...."జ్యో అచ్యుతానంద" ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ :'ఊహలు గుసగుసలాడే' సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్ నారా రోహిత్, నాగశౌర్యలు హీరోలుగా ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'జ్యో అచ్యుతానంద' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా తాజాగా ఆడియో విడుదలైంది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని చూసినవారంతా అప్పట్లో కదిర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ప్రేమ దేశం ను గుర్తు చేస్తోందంటున్నారు.
రెజీన కసాండ్ర హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ జ్యోనర్‌లో రూపొందనున్న ఈ సినిమా టైటిల్, ప్రధాన పాత్రల పేర్లైన 'జ్యో అచ్యుత్ ఆనంద్'లతో తెలివిగా ముడిపెట్టారు శ్రీని అవసరాల.
గతంలో 'ఊహలు గుహగుసలాడే' వంటి రొమాంటిక్ సినిమాని ప్రేక్షకులకందించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాని ఇద్దరు అన్నదమ్ముల కథకు ప్రేమకథను జోడించి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా, నాగశౌర్య అతని తమ్ముడిగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణ్ కోడూరి సంగీతాన్ని అందించనున్నారు.
అలాగే ఈ సినిమాలో రెజీనా డెంటిస్ట్ పాత్రను పోషిస్తోందిట. చాలా మంది అమ్మాయిలు నిజ జీవితంలో ఎదుర్కొనే పాత్రను ఇందులో పోషిస్తున్నానని రెజీనా చెప్తోంది. పద్దతైన కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి ఇద్దరు అన్నదమ్ములతో రిలేషన్ ఎలా ఉండబోతోందనే కాన్సెప్ట్ అంటున్నారు.

జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్ర ల చుట్టూ ఈ కథ తిరుగు తుందట. వారి పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్ ఎంపిక చేసుకున్నాడు.
చక్కటి ప్రేమ కథను స్క్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అవసరాల శ్రీనివాస్ తన రెండో సినిమా కోసం 'జ్యో అచ్యుతానంద' అనే టైటిల్‌ను ఖరారు చేయటంతోనే సగం సక్సెస్ సాధించారు.


Click it and Unblock the Notifications











