మంచు మనోజ్‌‌తో గొంతు కలిపిన నారా రోహిత్.. ఇక తాడో పేడో తేల్చుకొంటారట..

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం ఒక్క‌డు మిగిలాడు.

By Rajababu

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై రూపొందుతున్న చిత్రం ఒక్క‌డు మిగిలాడు. ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి యువ కథానాయకుడు నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.

చిరస్థాయిగా మిగిలిపోవాలని..

చిరస్థాయిగా మిగిలిపోవాలని..

ఒక్కడు మిగిలాడు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు నారా రోహిత్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కడు మిగిలాడు చిత్ర టీజర్, ట్రైలర్లను చూసిన వెంటనే మనోజ్ మెసేజ్ చేశాను. ఈ చిత్రం ఓ విభిన్నమైన చిత్రమని అనిపిస్తున్నది. ఈ చిత్రం ఇండియన్ సినిమాలో చిరస్థాయిగా మిగిలిపోవాలని కోరుకొంటున్నాను అని నారా రోహిత్ అన్నారు.

బ్లాక్ బస్టర్ కోసం మనోజ్ కసరత్తు

బ్లాక్ బస్టర్ కోసం మనోజ్ కసరత్తు

గత కొద్దికాలంగా భారీ సక్సెస్ లేకుండా ఉన్న మనోజ్ ఒక్కడు మిగిలాడుతో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి ఫైట్స్, డాన్సులు కూడా మనోజ్ కంపోజ్ చేశాడు. రొటీన్ సబ్జెక్ట్‌లు ఎన్నుకోకుండా ఓ డిఫరెంట్ కథతో, భావోద్వేగమైన స్క్రీన్‌ప్లేతో సిద్ధమవుతున్నాడు. విజయాన్ని చేజిక్కించుకొనేందుకు నారా వారి అబ్బాయితో చేతులు కలపడం విశేషం.

నారా రోహిత్ వాయిస్ ఓవర్

నారా రోహిత్ వాయిస్ ఓవర్

నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. మనోజ్ కోరిక మేరకు నారా రోహిత్ గారు మా చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం సంతోషంగా ఉంది. సినిమా ఓపెనింగ్ లో వచ్చే నారా రోహిత్ వాయిస్ ఓవర్ సినిమాలోకి ఆడియన్స్‌ను ఇన్వాల్వ్ చేస్తుంది అని అన్నారు.

అడ్డంకులను ఎదుర్కొని

అడ్డంకులను ఎదుర్కొని

ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్నో అవాంతరాలను దాటుకొని నవంబర్ 10న మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి మా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం అని లక్ష్మీకాంత్ అన్నారు.

మంచు మనోజ్‌తో అనీషా అంబ్రోస్

మంచు మనోజ్‌తో అనీషా అంబ్రోస్

ఒక్కడు మిగిలాడు చిత్రంలో మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వీ కోదండ రామరాజు, ఎడిటర్‌గా కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే రైటర్‌గా గోపీమోహన్ వ్యవహరించారు. శివ నందిగామ సంగీతం అందించగా, నిర్మాతలుగా ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకుడిగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X