Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘ఆటగాళ్ళు’... డబ్బింగ్ మొదలెట్టిన నారా రోహిత్
నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటిలిజెంట్ థ్రిల్లర్ "ఆటగాళ్లు". పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నారా రోహిత్ సరసన హీరోయిన్గా దర్శనా బానిక్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. బుధవారం చిత్ర కథానాయకుడు నారా రోహిత్ ఈ చిత్రానికి డబ్బింగ్ మొదలు పెట్టారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం ఊహించినదానికంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నారా రోహిత్ ఈ రోజు డబ్బింగ్ ప్రారంభించారు. దర్శకుడు మురళి "ఆటగాళ్లు" చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం" అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.