twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పట్లో సౌందర్య కాళ్ళు కూడా పట్టుకున్నాను.. సినిమా కోసం నేను నమ్మింది ఒక్కటే: వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

    |

    టాలీవుడ్ హీరో ఒంటరి వెంకటేష్ రీమేక్స్ ఎక్కువగా చేస్తుంటారనది అందరికి తెలిసిన విషయమే. అయితే అలాంటి కథలకు ఆయన వీలైనంత వరకు సేఫ్ జోన్ లో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక నారప్ప విషయంలో కూడా దాదాపు అలానే ట్రై చేశారు. అసురన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఆ సినిమాలో పెద్దగా మార్పులు ఏమి చేయలేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటి కథలు ఎంచుకోవడానికి గల కారణాన్ని చెప్పిన వెంకీ గతంలో సౌందర్య తో చేసిన ఒక సినిమా గురించి కూడా గుర్తు చేసుకున్నారు.

    ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా

    ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా

    తమిళ్ లో ధనుష్ నటించిన అసురన్ సినిమాను తెలుగులో నారప్ప గా రీమేక్ చేస్తున్నారని ఎనౌన్స్మెంట్ వచ్చినప్పుడే తమిళ జనాల్లో కూడా ఆసక్తి మొదలైంది. తెలుగులో ఏవైనా మార్పులు చేస్తారేమో అని అనుకున్నారు. కానీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్లు గానే ప్రజెంట్ చేశాడు.

    Narappa twitter review: ఆ ఒక్క విషయంలో అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్.. హైలెట్ క్యారెక్టర్ అదే!Narappa twitter review: ఆ ఒక్క విషయంలో అప్సెట్ అవుతున్న ఫ్యాన్స్.. హైలెట్ క్యారెక్టర్ అదే!

    భయం కలగలేదు

    భయం కలగలేదు

    ఇక సినిమాలో హీరో పాత్ర విధానం తనకు ఎంతగానో నచ్చింది అని వెంకటేష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వివరణ ఇచ్చారు. కథ విన్నప్పుడు వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలిపారు. అయితే అంత విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ను జనాలు ఎంతవరకు ఆమోదిస్తారు అనే విషయంలో తనకు ఏ మాత్రం భయం కలగలేదు అని చెప్పారు.

    సౌందర్య కాళ్ళు పట్టుకున్న వెంకీ

    సౌందర్య కాళ్ళు పట్టుకున్న వెంకీ

    గతంలో చాలాసార్లు నేను చేసిన కొన్ని ప్రయోగాలకు మొదట విమర్శలు వచ్చాయి. అసలు చంటి సినిమా ఒప్పుకున్నప్పుడు అలాంటి సినిమాలు చేయవద్దని చాలామంది చెప్పారు. ఇక పవిత్ర బంధం సినిమా సమయంలో సౌందర్య కాళ్ళు పట్టుకున్న పోస్టర్ అప్పట్లో అందరిని షాక్ కు గురి చేసింది. ఇలాంటి సినిమాలు ఆడవని కూడా ఎంతోమంది అన్నట్లు వెంకటేష్ వివరణ ఇచ్చారు.

    Recommended Video

    Venkatesh On Jet Speed | Narappa And F3 To Hit Screens In 2021
    కొత్త కంటెంట్ ను అర్థమయ్యేలా చెబితే

    కొత్త కంటెంట్ ను అర్థమయ్యేలా చెబితే

    సినిమాలో పాత్రలు కథకు తగ్గట్లుగా అందరికి కనెక్ట్ అయితే ప్రయోగాలు ఎన్ని చేసినా కూడా ఏమి కాదు. కొత్త కంటెంట్ ను వాళ్లకు అర్థమయ్యేలా చెబితే తప్పకుండా రిసీవ్ చేసుకుంటారని వెంకటేష్ వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో దృశ్యం 2 సినిమాతో పాటు F3 సినిమాలతో సిద్ధమవుతున్న విషయం తెలిసిన. ఆలాగే రానున్న రోజుల్లో మరో రెండు సినిమాలపై క్లారిటీ ఇవ్వవచ్చని సమాచారం.

    English summary
    Narappa, a remake of the Kollywood hit movie Asuran, has been released on Amazon Prime. The film stars Venkatesh Priyamani. The industry as a whole is waiting to see what kind of result this film, which came out to the audience last night, will receive. Audiences watching the movie are sharing their experiences on social media. Commenting on the movie result via Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X