నారప్ప చిన్న కొడుకు సీనప్ప.. పర్సనల్ లైఫ్‌లో కూడా అంతే కసిగా.. ఆసక్తికరమైన విషయాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నారప్ప రిజల్ట్ పై కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. సినిమా అయితే అంచనాలకు రీమేక్ చేయలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం వెంకటేష్ నటనకు ఫిదా అవుతున్నారు. ఇక సినిమాలో మిగతా పాత్రలలో సీనప్ప చాలా బాగా హైలెట్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చాలానే వస్తున్నాయి. ఇక అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

మంచి ఆఫర్ ఇవ్వడంతో

మంచి ఆఫర్ ఇవ్వడంతో

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన నారప్ప సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక అమెజాన్ ప్రైమ్ మంచి ఆఫర్ ఇవ్వడంతో థియేట్రికల్ బిజినెస్ ను కాదని ఓటీటీ డీల్ కు ఒకే చెప్పేశారు. ఈ సినిమా తమిళ్ మూవీ అసురన్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే.

హైలెట్ అవుతున్న సీనప్ప

హైలెట్ అవుతున్న సీనప్ప

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎంతో ఇష్టంతో చేసిన ఈ సినిమాను దాదాపు తమిళ్ లో ఉన్నట్లుగానే రీమేక్ చేశాడు. ఏ మాత్రం మార్పులు చేసినా కూడా మొదటికే మోసం వస్తుందని పెద్దగా రిస్క్ తీసుకోలేదు. ఇక సినిమాలో సీనప్ప పాత్ర ఓ వర్గం వారికి బాగానే నచ్చేసింది. అన్నను చంపిన వారిపై పగ తీర్చుకునే పాత్రలో అతను చూపించిన కసి బాగానే హైలెట్ అయ్యింది.

 కొన్ని పెద్ద సినిమాల్లో నటించాను

కొన్ని పెద్ద సినిమాల్లో నటించాను

సీనప్ప అసలు పేరు గీత కృష్ణ. అందరూ ముద్దుగా రాఖీ అని పిలుచుకుంటారట. ఇక నారప్ప సినిమా తరువాత అతన్ని అందరూ సీనప్ప అనే పిలుస్తున్నారు. అన్నయ్య క్యాస్టింగ్ మ్యానేజర్ అయినప్పటికీ మొదట్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. కొన్ని పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ ఎడిటింగ్ లో లేపేశారట.

 రంగస్థలం సినిమాలో ఉన్నాను

రంగస్థలం సినిమాలో ఉన్నాను

రంగస్థలం సినిమాలో పోస్టర్లు అతికించే కుర్రాడిగా కనిపించింది నేనే అంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ వివరణ ఇచ్చాడు. ఇక నటన కోసం కసిగానే ప్రయత్నాలు చేసినట్లు చెబుతూ.. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిపాడు. స్కూల్ ఏజ్ లోనే చాలా ఆడిషన్స్ కు తిరిగినట్లు తెలిపాడు.

Recommended Video

Producer Kalaipuli S Dhanu About Narappa Movie | Filmibeat Telugu
 నారప్పలో అలా సెలెక్ట్ అయ్యాను

నారప్పలో అలా సెలెక్ట్ అయ్యాను

నారప్ప సినిమాలో అవకాశం కోసం ఆడిషన్స్ కు వెళ్లినప్పుడు అంతకంటే ముందే ఒక ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యే రెండు రోజుల ముందు శ్రీకాంత్ అడ్డాల నా ఆడిషన్స్ చూసి ఫిక్స్ చేశారు. అనంతరం వెంకటేష్ గారు కూడా పర్సనల్ గా రామానాయుడు సినిమాలో టెస్ట్ చేసి ఒకే చేసినట్లు రాఖీ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X