twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌లో విషాదం.. టాప్ ప్రొడ్యూసర్ ఆకస్మిక మృతి

    |

    కొద్దిరోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో ఉన్న కురు వృద్దులలో ఒకరైన ఏసియ‌న్ గ్రూప్ ఛైర్మ‌న్ నారాయ‌ణ్ దాస్ కే నారంగ్ కన్నుమూశారు. ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూష‌న్, ప్రొడ‌క్ష‌న్‌, ఎగ్జిబిష‌న్ ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆయన వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. నైజాం ఏరియాలో వ‌న్ ఆఫ్ ది టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ లలో ఒకరిగా నారాయ‌ణ్ దాస్ నారంగ్‌ పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయ‌న ప్రొడ‌క్ష‌న్ హౌజ్ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర తెలుగులో ప్ర‌స్తుతం అత్యంత‌ బిజీగా ఉన్న నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా ఉంది.

    అంతే కాక తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా నారాయణ్ దాస్ కె.నారంగ్ ఉన్నారు. ఇటీవల మహేష్ తో కలిసి AMB సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోని ఉత్తమ మల్టీప్లెక్స్ లలో ఒకటిగా నిలిచింది. మహేష్ .. అల్లు అర్జున్ సహా పలువురు స్టార్లతో కలిసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలోనూ నారంగ్ ఉన్నారు.

    Narayana das narang passed away

    కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ నారంగ్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఏషియన్ మల్టీ ప్లెక్స్, ఏషియన్ థియేటర్స్ చైన్ కు అధినేత కూడా. ఇక శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో లవ్ స్టొరీ, లక్ష్య సినిమాలను నిర్మించిన నారాయణ దాస్ కె నారంగ్ ప్రస్తుతం నాగార్జునతో ఘోస్ట్ సినిమా, ధనుష్ తో ఒక మల్టీ లింగ్యువల్ సినిమాని సుధీర్ బాబుతో ఒక సినిమా నిర్మిస్తున్నారు.

    ఇక వీటితోపాటు త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ తో అనుదీప్ చేస్తున్న సినిమాలో కూడా ఆయన సహ నిర్మాతగా ఉన్నారు. వీరు కాకుండా టాలీవుడ్ హీరోలు శ‌ర్వానంద్‌, అడివి శేష్, నిఖిల్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఇక ఆయన మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్ బాడిని ఆస్పత్రి నుంచి మరో గంటలో వారి ఇంటికి తీసుకు వెళ్లనున్నారు. మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారి ఇంటికి సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి పరామర్శించనున్నారు.

    English summary
    Tollywood producer Narayana das narang passed away due to ill health.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X