తెలంగాణపై మళ్లీ ఆర్.నారాయణమూర్తి

By Srikanya

ఆ మధ్యన తెలంగాణ ఉద్యమ నపధ్యంలో ఆర్.నారాయణ మూర్తి వీర తెలంగాణ"అనే చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే.దానితో సంతృప్తి చెందిని నారాయణ మూర్తి తెలంగాణ నేపథ్యంలో 'పోరు తెలంగాణ"అంటూ మరో చిత్రం తెరకెక్కించటానికి సిద్దమయ్యారు. సొంత నిర్మాణ సంస్థ 'స్నేహచిత్ర" పతాకంపై ఆయన రూపొందించిన 22వ సినిమా ఇది. సింగరేణి, కరీంనగర్, ఆదిలాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు.

ఈ చిత్రం విశేషాలను ఆర్.నారాయణమూర్తి మంగళవారం వివరిస్తూ -''1952 నుంచి ఇప్పటి వరకూ జరిగిన తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. 'అన్నదమ్ముల్లారా విడిపోదాం. ఆత్మీయుల్లారా కలిసుందాం" అనే నినాదాన్ని ప్రత్యేకంగా ఈ సినిమాలో ప్రస్తావించాం.తెలంగాణ ఉద్యమం స్వచ్ఛమైనది, సత్యమైనది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నాను. దాదాపుగా అంతా కొత్తవాళ్లతోనే ఈ సినిమా చేశాం అన్నారు.

అలాగే సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజైన ఆగస్టు 6న కేసీఆర్ చేతుల మీదుగా ఆడియోను విడుదల చేయబోతున్నాం.ప్రజాకవులు వంగపండు ప్రసాదరావు, గూడ అంజయ్య, అంద్శై మిత్ర, అభినయ శ్రీనివాస్, మెట్టపల్లి సురేందర్, శూర రాజన్న, నేర్నాల కిషోర్ రాసిన అమోఘమైన పాటలు ఇందులో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం"" అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చిరంజీవి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-నిర్మాత-దర్వకత్వం: ఆర్.నారాయణమూర్తి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X