ఎన్టీఆర్ అడిగారని రాశా..అంతే : సినారె
"తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది.." అనే పాటను అప్పట్లో ఎన్టీఆర్ కోరికమేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. అలాగే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈనాటిది కాదని, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలన్న ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని, అయితే తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటే నష్టమేమీ లేదన్నారు. ఇక ఎన్‌డీఏ హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు చిన్నరాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా స్వయంసమృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications











