twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధాని మెచ్చిన పాట.. చిరంజీవి, నాగార్జునలపై మోడీ కామెంట్స్.. మెగాస్టార్ రియాక్షన్ అదుర్స్

    |

    కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలోనూ ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే మనదేశంలో దాదాపు 2500 కరోనా బారిన పడ్డారు. యాభై మంది దాకా ప్రాణాలను కోల్పోయారు. పరిస్థితి రోజురోజుకూ తీవ్రతరం దాల్చుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

    Recommended Video

    PM Modi Telugu Tweet To Appreciate Chiranjeevi & Nagarjuna And Tollywood
    నువ్వా నేనా అన్నట్టు పోటీ..

    నువ్వా నేనా అన్నట్టు పోటీ..

    కరోనా వైరస్ విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 260కి పైగా కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఏపీలో దాదాపు 170మంది ఈ వైరస్ బారిన పడ్డారు. క్రమక్రమంగా కేసులు పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా మారింది. దీంతో కరోనాపై అవగాహన కలిగించేందుకు సినీ ప్రముఖులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.

    పాటల రూపంలో..

    పాటల రూపంలో..

    పాటల రూపంలో కరోనాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోటీ, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, ఆర్జీవీ వంటి వారు తమ కలానికి పదును పెట్టి కరోనాపై గురి పెట్టారు. ఈ నేపథ్యంలో కోటి స్వరపరిచిన గీతంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నటించారు. అందరికీ ఓ చక్కటి సందేశాన్ని ఇచ్చారు.

    ప్రధాని మెచ్చిన పాట..

    ఈ పాటను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. కరోనాపై అవగాహన కలిగించేందుకు చేసిన ప్రయాత్నాన్ని ప్రశంసించారు. ‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దామ'ని ట్వీట్ చేశాడు.

    మెగాస్టార్ రియాక్షన్..

    మెగాస్టార్ రియాక్షన్..

    ప్రధాని ప్రశంసలపై చిరంజీవి స్పందించాడు. ‘మీ అమూల్యమైన ప్రశంసలకు ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు.. కరోనా బారి నుంచి మన దేశాన్ని కాపాడేందుకు మీరు పడుతున్న శ్రమను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మేము మా తరుపున చేతనైన సాయాన్ని చేస్తున్నాము. సంగీత దర్శకుడు కోటీ గారు మా అందరి తరుపున మీకు నా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Narendra Modi Appreciate Chiranjeevi And Nagarjuna For Making Awareness On Corona. PM Thanked Chiranjeevi, Nagaruna, Varun Tej And Sai Dharam Tej On Special Song On Corona Virus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X