»   » నరేంద్ర మోడీపై...సెక్స్‌బాంబ్ మల్లికా షెరావత్ కామెంట్స్

నరేంద్ర మోడీపై...సెక్స్‌బాంబ్ మల్లికా షెరావత్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల రథ సారథి నరేంద్ర మోడీపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఆమె మాట్లాడుతూ....నరేంద్ర మోడీ ఇండియా యొక్క మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ వ్యాఖ్యలు చేసారు.

త్వరలో మల్లిక షెరావత్ తనకు సరిజోడీ గల మగాడి కోసం ఓటీ‌షో ద్వారా అన్వేషణ ప్రారంభించబోతోంది. 'The Bachelorette India - Mere Khayalon Ki Mallika' పేరుతో ఈ టీవీ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 'భారతదేశపు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు?' అనే ప్రశ్న‌కు స్పందిస్తూ మల్లికా షెరావత్ ఈ వ్యాఖ్యలు చేసారు.

Mallika Sherawat-Narendra Modi

'నా అభిప్రాయం ప్రకారం నరేంద్ర మోడీ మెస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. అతను ఎంతో స్మార్ట్, ప్రొగ్రెసివ్' అంటూ తన టీవీ షో 'The Bachelorette India - Mere Khayalon Ki Mallika' ప్రచార ట్రైలర్ విడుదల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. తన షో పాపులర్ కావాలనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.

ఇక ఈ టీవీ షో కార్యక్రమం విషయానికొస్తే....ఇదొక డేటింగ్ రియాల్టీ షో. మొత్తం 30 మందిని కంటెస్టెంట్స్ వివిధ రకాలుగా పరీక్షించి ఒకరిని మల్లికా షెరావత్ సరిజోడీగల మగాడిని ఎంపిక చేస్తారు. అక్టోబర్ 07 నుంచి 'లైఫ్ ఓకే' ఛానల్‌లో ఈ షో ప్రసారం కానుంది.

English summary
“I think Narendra Modi is India's most eligible bachelor. He is smart, progressive and often misunderstood like me,” the 36-year-old said here during the launch of the promotional trailer of her forthcoming TV show The bachelorette India - Mere Khayalon ki Mallika here Friday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu