ఫొటోలు: నరేంద్ర మోడీతో తెలుగు సిని ప్రముఖులు భేటీ
హైదరాబాద్: 'నవ భారత యువభేరి' సభలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ఎన్నికల ప్రచార సారథి నరేంద్రమోడీతో పార్క్‌హయత్ హోటల్‌లో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు భేటీ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలుసు సిని పరిశ్రమకు చెందిన వారు సైతం మోడీ ని కలిసారు.
సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, కీరవాణి, కోట శ్రీనివాసరావు, రాంగోపాల్‌వర్మ, బాలకృష్ణ, దిల్‌రాజు, మురళీమోహన్, మోహన్‌బాబు, జగపతిబాబు, అలీ, సుమన్, మంచు లక్ష్మి, మంచు విష్ణు, గౌతమి తదితరులు మోడీని కలిసిన వారిలో ఉన్నారు
నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటన ద్వారా పలువురు ప్రముఖులను తన వైపు తిప్పుకోవడంలో బిజెపి విజయం సాధించినట్లేనని అనుకుంటున్నారు. నరేంద్ర మోడీతో ప్రముఖుల భేటీకి మీడియాను అనుమతించలేదు. కానీ, కొన్ని ఫోటోలు మీడియాకు వచ్చాయి..
అవి మీ కోసం...

మురళి మోహన్ తో...
తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అయిన మురళి మోహన్..వెళ్లి మోడీని కలిసారు. తెలుగు దేశం పార్టికి చెందిన వారైనా ఆయన కలవటం చర్చనీయాంసంగా మారింది. అయితే ఆయన తో గౌరవంగా కలవటమే కానీ ప్రత్యేకంగా సినిమాల గురించి ముచ్చటించటానికి ఏమీ లేదని అంటున్నారు. అయితే ఏమి మాట్లాడారు అనేది బయిటకు రాలేదు. తెలుగుదేశం నాయకుడు, సినీ నటుడు మురళీ మోహన్ నరేంద్ర మోడీని కలిశారు. మురళీ మోహన్ వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ స్థానం నుంచి బిజెపి మరో నటుడు కృష్ణంరాజును పోటీకి దించే అవకాశాలున్నాయి.

బాలకృష్ణ...
పార్క్ హయత్ హోటల్‌లో నరేంద్ర మోడీని నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణకు నరేంద్ర మోడీపై అభిమానం ఉంది. తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ బాలకృష్ణను ఆహ్వానించారు. కానీ రాజకీయ కారణాల వల్ల వెళ్లలేదు. తన రెండో కూతురు పెళ్లికి బాలకృష్ణ మోడీని ఆహ్వానించారు.

మోహన్ బాబు...
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇలా మోడీని సత్కరించింది. మోహన్ బాబు గౌరవంగా ఆయన్ని కలిసి మాట్లాడారు. మంచు మనోజ్ ..దండ పట్టుకుని వచ్చారు. అలాగే విష్ణు సైతం మోడీతో ముచ్చటించారు. ఇలా మొత్తం మంచు ఫ్యామిలీ మోడిని కలిసింది.

కృష్ణరాజు..
కిషన్ రెడ్డి సమక్షంలో కృష్ణం రాజు...మోడిని కలిసారు. గతంలో కృష్ణ రాజు బి.జిపి తరుపున పనిచేసారు. ఇక షూటింగ్ లలో బిజీగా ఉన్న ఆయన ప్రత్యేకంగా పని గట్టుకుని మోడిని కలిసి హైదరాబాద్ సభ విజయవంతం కావాలని కోరుకున్నారు. రాజమండ్రి స్థానం నుంచి బిజెపి కృష్ణంరాజును పోటీకి దించే అవకాశాలున్నాయి. ఆయనకు పోటీగా మురళి మోహన్ నిలుస్తారని సమాచారం.

రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా నరేంద్ర మోడీని కలుసుకున్నారు. సినీ పరిశ్రమలో రాఘవేంద్ర రావుకు మంచి పేరు, పలుకుబడి ఉంది. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమానికి తన సహకారం అందించారు. అలాగే ఆయనకు రాజకీయపార్టీలన్నిటిలోనూ మిత్రులున్నారు. మోడీని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అరవింద్
కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి బావమరిది, ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పార్క్ హయత్ హోటల్లో గుజారత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆయన ఇలా పార్క్ హయత్ హోటల్‌కి దారి పట్టారు. అల్లు అరవింద్ కు మొదటి నుంచి రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. సిటీకి వచ్చిన రాజకీయనాయకులను ఆయన కలవటమో...లేక వారు ఆయన్ని కలవటమో చేస్తూంటారు.

సుమన్ కూడా మోడీతో..
ప్రముఖ సినీ నటుడు సుమన్ నరేంద్ర మోడీని కలుసుకున్నారు. సుమన్‌కు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. అవకాశం వస్తే ఆయన బిజెపి నుంచి పోటీ చేస్తారా అనేది భవిష్యత్తు తేలుస్తుంది. ఆయన తాను బి.సి నని అవకాసం ఉంటే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తానని చెప్తున్నారు.

మోడీతో దిల్ రాజు
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు కూడా బిజెపి నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆయన పార్క్ హయత్ హోటల్‌లోకి వెళ్తూ ఇలా కనిపించారు. ఆయన బిజెపితో కలిసి పనిచేస్తారా అనేది చెప్పలేం. దిల్ రాజు నిర్మించిన సినిమా ...సీమాంధ్ర ఉద్యమ నేపధ్యంలో వాయిదా పడింది.

కీరవాణితో ...
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా మోడీని కలుసుకున్నారు. సభ విజయవంతం అవ్వాలని శుభాకాంక్షలు తెలియచేసారు. కీరవాణి గతంలో లోక్ సత్తా పార్టీ తరుపున పని చేస్తారని వినిపించింది. మోడీని కలిసిన నేపధ్యంలో పార్టీ మారుతారా లేక గౌరవంగా కలిసనదేనా అనేది చర్చనీయాంసంగా మారింది.

దగ్గుపాటి రానా తో...
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు ...హీరో దగ్గుపాటి రానా సైతం మోడిని కలిసారు. ఆయన సాదరంగా రానా ని ఆహ్వానించారు. వెంకయ్యనాయుడుతో సైతం ఆయన ముచ్చటించారు. రానా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేసారు.


Click it and Unblock the Notifications











