twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోహన్ లాల్, నాగార్జున, అనుష్క, దీపిక, రణవీర్‌, సినీ స్టార్లకు... ప్రధాని మోడీ రిక్వెస్ట్!

    |

    Recommended Video

    Prime Minister Narendra Modi Special Request To Film Stars | Filmibeat Telugu

    రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సినీ స్టార్స్ అందరూ తమ వంతు కృషి చేయాలని, ఓటర్లను చైతన్య వంతులను చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోరారు. ఈ మేరకు ఆయన ఆయా సెలబ్రిటీలను ఉద్దేశించి ట్వీట్స్ చేశారు.

    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అతి ముఖ్యమైనవి. తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభించింది. కానీ చాలా మంది ఓటర్లు పోలింగ్ తేదీని హాలిడేగా భావించి ఇంటికే పరిమితం అవుతుండటంతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటర్లను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

     ప్రధాని నరేంద్ర మోడీ రిక్వెస్ట్

    ప్రధాని నరేంద్ర మోడీ రిక్వెస్ట్

    ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రముఖులంతా ప్రజలను ప్రభావింతం చేయాలని ప్రధాని కోరారు. రాహుల్ గాంధీతో పాటు ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉన్న ఆల్ పార్టీ లీడర్స్. పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, జర్నలిస్టులు, సినీ స్టార్లు, మీడియా అధినేతలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

    డియర్ మోహన్ లాల్, నాగార్జున

    డియర్ మోహన్ లాల్, నాగార్జున

    సౌతిండియా స్టార్స్ మోహన్ లాల్, నాగార్జునను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ... మీరు ఎన్నో సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలను ఎంటర్టెన్ చేస్తున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ మేరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.

    మై యంగ్ ఫ్రెండ్స్

    మై యంగ్ ఫ్రెండ్స్

    బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, రణీర్ సింగ్, విక్కీ కౌశల్ తదితరులను ఉద్దేశించి... ‘మై యంగ్ ఫ్రెండ్స్. ఇపుడు మన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకునేలా మోటి వేట్ చేయాల్సిన అవసరం ఉంది' అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

     దీపిక పదుకోన్, అలియా భట్, అనుష్క శర్మ

    దీపిక పదుకోన్, అలియా భట్, అనుష్క శర్మ

    దీపిక పదుకోన్, అలియా భట్, అనుష్క శర్మను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ... లోక్ సభ ఎన్నికలపై భారీ ఎత్తున ప్రచారం చేసి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు.

    English summary
    Prime Minister Narendra Modi has requested Mohanlal and Nagarjuna and other influential celebs to create voter awareness for Lok Sabha elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X